అమరావతిలో పోలీసుల మార్చ్... రైతులకు వార్నింగ్

ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని కవాతు నిర్వహించి, మైకు ద్వారా సూచించారు. మందడంలో అయితే ఏకంగా పోలీసులు కవాతు నిర్వహించారు.

news18-telugu
Updated: January 11, 2020, 3:20 PM IST
అమరావతిలో పోలీసుల మార్చ్... రైతులకు వార్నింగ్
మందడంలో పోలీసుల కవాతు
  • Share this:
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు ఆయన ఇంటివద్ద భారీగా మోహరించారు. దీంతో ఉండవల్లి కరకట్ట పై ఎక్కడ చూసినా ఖాకీలే కనిపిస్తున్నారు. మాజీ మంత్రి నారా లోకేష్ బయటకు వస్తె అరెస్ట్ చేసేందుకు పోలీసు సన్నద్ధం అయ్యారు. మరోవైపు ఇవాళ తిరుపతిలో చంద్రబాబు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెల్చేశారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆయన ర్యాలీకి అనుమతి  ఇవ్వలేమన్నారు. తిరుపతిలోని ఫులే విగ్రహం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొని, సాయంత్రం 5 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

మరోవైపు రాజధాని గ్రామాల్లో సైతం పోలీసులు పహారా కాశారు. అమరావతి గ్రామాల్లో నాలుగు వారాలుగా అన్నదాతలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారిని అడ్డుకునేంందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రాజధాని గ్రామాల్లో పలుచోట్ల డ్రోన్ కెమెరాల్ని సైతం వినియోగిస్తున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని మైకు ద్వారా సూచించారు. మందడంలో అయితే ఏకంగా పోలీసులు కవాతు నిర్వహించారు. పోలీసుల తీరుపై అమరావతి గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. అమరావతిలో ఏమైాన యుద్ధం ప్రకటించారా అని ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో మిలిటెంట్లు ఉన్నారా మోదీ గారు అని ప్రధానిని సైతం నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీ... భారతదేశంలోనే ఉంది కదా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

First published: January 11, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు