ఏపీలో బీజేపీ నేత అరెస్ట్.. అక్రమ మద్యం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు..

తెలంగాణలోని చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో.. ఏపీ బీజేపీ నేతను స్పెషల్‌ ఎన్‌ఫోర్సమెంట్‌ బ్యూరో పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.

news18-telugu
Updated: August 16, 2020, 8:48 PM IST
ఏపీలో బీజేపీ నేత అరెస్ట్.. అక్రమ మద్యం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆయన బాధ్యత గల రాజకీయ నాయుకుడు. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. డబ్బుల కోసం  అడ్డదారులు తొక్కారు.  అక్రమంగా మద్యం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణ నుంచి ఏపీకి మద్యం తరలిస్తూ బీజేపీ నేత పట్టుబడ్డారు.  తెలంగాణలోని చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలిస్తున్న కేసులో..  గుడివాక రామాంజనేయులు అలియాస్‌ అంబిబాబును ఏపీ స్పెషల్‌ ఎన్‌ఫోర్సమెంట్‌ బ్యూరో పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. గుడివాక రామాంజనేయులుతో పాటు మచ్చా సురేష్, కే.నరేష్, గంటా హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి  రూ.6లక్షలు విలువైన 1920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో  రామాంజనేయయులను ఏ-1గా పేర్కొన్నారు పోలీసులు.  కాగా,  2019లో మచిలీపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రామాంజనేయులు పోటీ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: August 16, 2020, 4:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading