మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ వివాదంలోకి ఏపీ కాంగ్రెస్...

అలాగే, ప్రభుత్వం ఎక్కడెక్కడ సహకరించడం లేదో అఫిడవిట్ సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

రమేష్ కుమార్‌ తొలగింపు, కనగరాజ్ నియామకం చెల్లదంటూ ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంపై కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. రమేష్ కుమార్‌ తొలగింపు, కనగరాజ్ నియామకం చెల్లదంటూ ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీలో రమేష్ కుమార్ తొలగింపు వివాదం రాజకీయంగా పెనుదుమారాన్ని సృష్టించింది. ఆయన తొలగింపుతో పాటు వెనువెంటనే మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి కనగరాజ్‌ను నియమించారు. ఆయన పదవీబాధ్యతలు కూడా తీసుకున్నారు. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు వాయిదా వేసింది.

    ఓ వైపు హైకోర్టులో వివాదం కొనసాగుతుండగానే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలతో రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ మీద విచారణ జరపాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీకి లేఖ రాశారు. రమేష్ కుమార్ సంతకాన్ని టీడీపీ నేతలు కనకమేడల రవీంద్ర కుమార్, టీడీజనార్దన్, వర్ల రామయ్య ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఆ లేఖ తానే రాశానని, ఇందులో థర్డ్ పార్టీ వ్యక్తులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ రమేష్ కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: