AP PARIRAKSHANA LEADER KOLIKALAPUDI SRINIVAS HITS BJP LEADER VISHNUVARDHAN REDDY WITH SLIPPERS SK
Vishnu Vardhan Reddy: బీజేపీ నేత విష్ణువర్ధన్‌కు లైవ్‌లో చెప్పు దెబ్బ.. వీడియో వైరల్
బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి(ఫైల్ ఫొటో)
విష్ణువర్ధన్ రెడ్డిపై జరిగిన దాడిన బీజేపేీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉద్యమం సరిగా చేయడం రాదు.. కనీసం డిబేట్లో హుందాగా ఉండడం కూడా రాదు.. మీరు మారరా..? అని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నాయి.
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేదు అనుభవం ఎదురయింది. ఓ టీవీ ఛానెల్ డిబేట్లో ఆయనపై చెప్పుల దాడి జరిగింది. మంగళవారం సాయంత్రం ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్లో ఏపీ మున్సిపల్ ఎన్నికలు, కేబినెట్ నిర్ణయాలు సహా పలు ఏపీ అంశాలపై చర్చా కార్యక్రమం జరిగింది. ఆ డిబేట్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ పరిరక్షణ సమితి నేత కొలికలపూడి శ్రీనివాస్‌తో పాటు మరికొందరు పాల్గొన్నారు. చర్చ సందర్భంగా విష్ణు, శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. శ్రీనివాస్‌ను పెయిడ్ ఆర్టిస్ట్ అని విష్ణువర్ధన్ రెడ్డి అనడంతో.. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ విష్ణుపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన చెప్పు తీసి విష్ణువర్ధన్ రెడ్డిపై విసిరారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాల్ వైరల్‌గా మారింది.
టీవీ కార్యక్రమం చర్చ వేదికలో బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డిపై దాడిని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. సమన్వయం పాటించే వ్యక్తులనే ఇలాంటి కార్యక్రమాలకు పిలవాలని ఆయన అన్నారు. తమ మీద తమకు కంట్రోల్ లేని వ్యక్తులను చర్చా వేదికలకు ఆహ్వానించకూడదని విజ్ఞప్తి చేశారు. ఆయనపై సదరు న్యూస్ ఛానెల్ వారే ఫిర్యాదు చేసి.. అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు.
విష్ణువర్ధన్ రెడ్డిపై జరిగిన దాడిన బీజేపేీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉద్యమం సరిగా చేయడం రాదు.. కనీసం డిబేట్లో హుందాగా ఉండడం కూడా రాదు.. మీరు మారరా..? అని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.