Ap Panchayat Elections: పోలింగ్ కేంద్రంలో పోలీసుల ముందే కొట్టుకున్న వైసీపీ-టీడీపీ

పోలింగ్ కేంద్రం అని ఆలోచించలేదు. పోలీసులు ఎదురుగా ఉన్నా పట్టించుకోలేదు.. ఒక్క ఓటు కోసం కుర్చీలతో కొట్టుకున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో ఇలాంటి ఘటనలు చాలానే జరగాయి.

పోలింగ్ కేంద్రం అని ఆలోచించలేదు. పోలీసులు ఎదురుగా ఉన్నా పట్టించుకోలేదు.. ఒక్క ఓటు కోసం కుర్చీలతో కొట్టుకున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ లో ఇలాంటి ఘటనలు చాలానే జరగాయి.

  • Share this:
    ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులపై అభ్యర్థులు పోటీ చేయకపోయినా.. ఆయా పార్టీల మద్దతుదారులే బరిలో దిగడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపుకోసం ఎందాకైనా అంటున్నారు. ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలోనూ పంచాయతీ ఎన్నికలు రచ్చ రచ్చగా మారాయి.. చాలాచోట్ల ఘర్షణలతో పరిస్థితి అదుపు తప్పింది.

    తాజాగా మూడో దశ పంచాయతీ ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలోని ఓ పోలింగ్ బూత్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీలకు చెందిన రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. అందరూ చూస్తుండగానే... అది పోలీసుల సమక్షంలో కొట్టుకుంటున్నారు. అంతా చూస్తున్నా సరే కుర్చీలతో కుమ్మేసుకున్నారు.  ఈ ఒక్క ఘటన చాలు ప్రస్తుతం మూడో దశ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి..

    విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం చౌడవరంలో ఓటర్లను పోలింగ్‌ బూత్‌కు తీసుకొచ్చే విషయంలో రెండు పార్టీల వర్గాల మధ్య విబేధాలు తలెత్తాయి. అది గొడవకు దారి తీసింది.  ఓటర్లను ప్రలోభ పర్చి పోలింగ్ బూత్ కు తీసుకొచ్చిన తరువాత కూడా ఆ వివాదం ఆగలేదు.  అలా పోలింగ్ బూత్ కు వచ్చిన ఓ ఓటర్ విషయంలో మళ్లీ వివాదం ముదిరింది.  ఒక  ఓటరుకు సంబంధించిన ఓటు విషయంలో గొడవ పెద్దైంది. ఆ ఓటరు తమ వర్గానికి చెందినవాడని ఒకరంటే.. మరో వర్గం వారు కాదు మా వాడు అంటూ మళ్లీ గొడవకు దిగారు.. ఆ ఒక్క ఓటు కోసం ఇరు వర్గాలు హద్దులు దాటాయి.  ఇటీవల చాలా చోట్ల అభ్యర్థులు ఒక్క  ఓటుతో గెలిచిన సందర్భాలు ఎక్కువ ఉండడంతో.. ఆ ఒక్క ఓటు కోసం పోలింగ్ కేంద్రంలోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి.

    ఇరు వర్గాలు మొదట గొడవపడుతుంటే పోలింగ్ సిబ్బంది, పోలీసులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఇరు వర్గాల్లో ఎవరూ వెనక్కు తగ్గలేదు. అది కూడా పోలింగ్‌ బూత్‌లో పోలీసుల సమక్షంలో పరస్పర దాడికి దిగారు. అయినా వారి ఆవేశం చల్లారకపోవడంతో  అక్కడే ఉన్న కుర్చీలనే తీసుకుని వాటితో కొట్టుకున్నారు. పరిస్థితి చేజారిపోవడంతో అప్రత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అంతవరకు కాసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. దీంతో అక్కడకు ఓట్లు వేయడానికి వచ్చిన ప్రజలు.. సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఇరు వర్గాలు అంతలా గొడవపడినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని నిలదీస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: