AP PANCHAYAT ELECTIONS VILLAGE PRESIDENT POST SOLD TO RS 52 LAKHS IN OPEN AUCTION IN EAST GODAWARI ANDHRA PRADESH PRN
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి రూ.52 లక్షలు... కానీ కండీషన్స్ అప్లై... ఎక్కడో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) వేలం పాటల జోరు మొదలైంది. తొలి విడత నామినేషన్లకు రెండు రోజుల ముందే పల్లెల్లో ఈ సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల్లో వేలం పాటల జోరు మొదలైంది. తొలి విడత నామినేషన్లకు రెండు రోజుల ముందే పల్లెల్లో ఈ సందడి నెలకొంది. ఓ వైపు అధికార పార్టీ ఏకగ్రీవాల కోసం యత్నిస్తుంటే.. మరోవైపు ప్రతిపక్షం పోటీనిచ్చేందుకు సై అంటోంది. ఇదిలా ఉంటే పలు గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచ్ పదవులకు వేలం పాటలు సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి సర్పంచ్ పదవిని రూ.30లక్షలకు పైగా పాడుకుని రికార్డ్ సృష్టించాడు. తాజాగా అదే జిల్లాలో మరో వ్యక్తి ఏకంగా అరకోటి ఖర్చు చేశాడు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అంత డబ్బా అని ఆశ్చర్య పోతున్నారా..? రాను రాను ఈ ఖర్చు కోటి రూపాయలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.
వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం, రాజపూడి గ్రామంలో సర్పంచ్ పదవికి స్థానికులు వేలంపాట నిర్వహించారు. దీంతో ఓ వ్యక్తి రూ.52లక్షలకు పదవిని కైవసం చేసుకున్నాడు. ఐతే ఇందులో చిన్న కండీషన్ కూడా ఉంది. వేలంలో గెలిచిన వ్యక్తికి ఏగ్రీవంగా ఎన్నికైనట్లు కాదు.., ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే. ఎన్నికల్లో ఓడిపోతే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక వేళ గెలిస్తే ఆ రూ.52 లక్షలను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు.
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోనే గొల్లప్రోలు మండలం దుర్గాడ పంచాయతీ సర్పంచ్ పదవి గ్రామస్తులు వేలంపాట నిర్వించారు. గ్రామ సర్పంచ్ పదవిని ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో రూ.33లక్షలకు సొంతం చేసుకున్నాడు. దుర్గాడ సర్పంచ్ స్థానం రిజర్వేషన్లలో బీసీలకు కేటాయంచారు. ఈ ఎన్నికల కోసం నిర్వహించిన వేలంలో నలుగురు వ్యక్తులు పోటీపడ్డారు. వేలంలో పోటిపడ్డ అభ్యర్థులు కాకుండా., ఇతర వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే.., ఎవరైతే ఎక్కువ ధరకు పాడుకుంటారో వారికే వేలం కట్టబెట్టడంతో పాటు.., ఎన్నికలు జరిగితే అతడ్నే గెలిపించాలని తీర్మానించారు. ఎవరూ పోటీలో నిలవకుంటే సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవం చేయాలని తీర్మానించారు.
ఐతే వేలంలో వచ్చిన సొమ్మును గ్రామస్తులకు పంచుతారనుకుంటే అది మీ పొరబాటే.., ఆ సొమ్మంతా ఊళ్లోని శివాలయ మండప నిర్మాణ పనులకు వినియోగించాలని నిర్ణయించారు. మొదటి విడత ఎన్నికల్లోనే పంచాయతీల వేలం పాటలు ఈ రేంజ్ లో ఉంటే.. ఎన్నికలు పూర్తయ్యేనాటికి కొన్ని మరిన్ని రికార్డురు సృష్టించడం ఖాయం.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.