AP PANCHAYAT ELECTIONS THIRD PHASE OF ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS IN 2640 PANCHAYATS STARTS NOW BA
AP Panchayat Elections: ఏపీలో మొదలైన మూడో విడత పంచాయతీ ఎన్నికలు
AP Panchayat Elections: ఏపీలో మొదలైన మూడో విడత పంచాయతీ ఎన్నికలు
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు నేడు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. 19,553 వార్డులకు 43,162 మంది పోటీ పడుతున్నారు.
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. 19,553 వార్డులకు 43,162 మంది పోటీ పడుతున్నారు. ఈ పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 60 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. రాష్ట్రంలో 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, నక్సల్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలను వర్గీకరించి, వాటికి అదనపు భద్రత కల్పించారు. ఎస్ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల తీరుపై పర్యవేక్షణ చేస్తున్నారు. ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. విశాఖ, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.
13 జిల్లాల్లో 2,640 పంచాయతీలకు పోలింగ్
26,851 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం
ఏజెన్సీ ప్రాంతాల్లో 1.30 గంటలకే పోలింగ్ ముగింపు
ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కంట్రోల్ సెంటర్లు
ఏపీలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశలు అయిపోయాయి. ఇక మూడో దశ ఇవాళ జరుగుతోంది. నాలుగోదశ ఫిబ్రవరి 21న జరగనుంది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచి మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతాయని ప్రకటించారు. మార్చి 10న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరుగుతాయి. పంచాయతీ ఎన్నికల్లో తాము చాలా సీట్లు గెలిచామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రచారం చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి కాబట్టి, అందులో ఎవరి సత్తా ఎంత అనేది క్లియర్గా తెలిసే అవకాశం ఉంది.
త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు?
త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు నిమ్మగడ్డ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలను కూడా గతంలో నిలిపేసిన దశ నుంచి కొనసాగించాలా లేక కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలా అనే అంశంపై ఎస్ఈసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చలు జరుపుతోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా.. చాలా మండలాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరించి ఏకగ్రీవాలు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు కూడా అందాయి. అప్పట్లో ఎన్నికలు వాయిదా పడటంతో ఏకగ్రీవాలు, ఫిర్యాదుల అంశానికి బ్రేక్ పడింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.