• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP PANCHAYAT ELECTIONS TDP TENSION ON NARAVARIPALLI POLLING SITUATION NGS

AP Panchayat Elctions: చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో ఏం జరుగుతోంది?.. రిజల్ట్ పరిస్థితి ఏంటి?

AP Panchayat Elctions: చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో ఏం జరుగుతోంది?.. రిజల్ట్ పరిస్థితి ఏంటి?

చంద్రబాబునాయుడు (FIle)

కుప్పం రిజల్టు చేసిన డ్యామేజ్‌ తట్టుకోకముందే.. నారావరి పల్లిలో ఓడితే పరిస్థితి ఏంటి అని టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అందుకే అనుక్షణం అక్కడ నిఘా వేసి ఉంచారు. ఆరు నూరైనా నారావారి పల్లిలో గెలవాల్సిందేనని లేదంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని భావిస్తున్నారు. మరి ఫలితం ఎలా వస్తుందో చూడాలి.

  • Share this:
    ఆఖరి దశ పంచాయతీ ఎన్నికల్లో అందరి ఫోకస్ ఆ ఒక్క గ్రామంపైనే ఉంది. అదే ప్రతిక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లి. ఇప్పటికే కుప్పంలో అనూహ్య ఫలితాలు సాధించింది అధికార వైసీపీ. తరువాత టార్గెట్ నారావారి పల్లే అనడంలో డౌట్ లేదు. పోలింగ్ తీరు.. అక్కడ జరుగుతున్న ఘర్షణలు చూస్తే వైసీపీ టార్గెట్ నారావల్లి పల్లె అని స్పష్టంగా చెప్పొచ్చు.

    చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజవర్గంలో పంచాయతీ ఫలితాలు టిడిపి, వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. మూడో దశ ఎన్నికల్లో కుప్పంలో 89 పంచాయతీల్లో 75 వైసీపీ గెలిస్తే, టీడీపీ కేవలం 13 మాత్రమే గెలిచింది. ఈ షాకింగ్‌ పలితాలు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ముఖ్యంగా చంద్రబాబుకు తిరుగులేదనుకున్న చోట టీడీపీ 13 చోట్లకే పరిమితం అవ్వడం చూసి.. చిత్తూరు జిల్లా తమ్ముళ్ళు,  టీడీపీ అధినేత అవాక్కయారు కూడా.. ఆ ఫలితాలపై ఇప్పటికే పలుమార్లు రివ్యూ చేశారు చంద్రబాబు.

    కుప్పం రిజల్టు చేసిన డ్యామేజ్‌ తట్టుకోకముందే.. నారావరి పల్లిలో ఓడితే పరిస్థితి ఏంటి అని టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అందుకే అనుక్షణం అక్కడ నిఘా వేసి ఉంచారు. ఆరు నూరైనా నారావారి పల్లిలో గెలవాల్సిందేనని లేదంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని భావిస్తున్నారు.

    దీనికితోడు కందులవారిపల్లి పంచాయతీ మొదటి నుంచి టీడీపీకి కంచుకోటలా ఉంది. ఇప్పటి వరకు ఆ పార్టీ మద్దతుదారులు ప్రభాకర్ నాయుడు, బెనర్జీ నాయుడు, చంద్రకుమార్ నాయుడులే సర్పంచ్‌లుగా కొనసాగారు. మొదటి నుంచి టీడీపీ పాగా వేస్తున్న కందులవారిపల్లి పంచాయతీని కైవసం చేసుకునేందుకు వైసీపీ ఫోకస్ పెట్టింది. 650 ఓట్లతో అతి చిన్న పంచాయతీగా ఉన్న కందులవారిపల్లికి పక్కనున్న నారావారిపల్లె, శేషాపురం, బి.కొంగరవారిపల్లి పంచాయతీలను కలిపి 1404 ఓట్లతో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ వైసీపీ ఎస్సీ మహిళకు అవకాశం ఇస్తే.. టీడీపీ ఓసి మహిళను రంగంలో దింపారు. ఫలితం ఎలా వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    తాజా పోలింగ్ పైనా టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కందులవారిపల్లిలో భారీగా దొంగ ఓట్లు వేయిస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు.  20 మందిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. మరోవైపు నారావారిపల్లెలో దొంగ ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలు, రిగ్గింగ్ జరుగుతుందనే విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు. నారావారిపల్లె పంచాయతీలో దొంగ ఓట్లు వేయడానికి తిరుపతి నుంచి కొంతమంది యువకులు వచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తగా వచ్చిన యువకులు అనుమానస్పదంగా ఉన్నా.. గ్రామస్తులు చెప్పే వరకు పోలీసులు వారిని తనికీలు చేయలేదని ఆరోపిస్తున్నారు. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం ఓటరు ఆధార్, ఓటరు స్లిప్ అన్ని చూపించి లోపలకు వెళ్లాలి. కానీ అవేవి లేకుండా దొంగఓట్లు వేయడానికి వస్తున్నారని ఆందోళనకు దిగారు.  ఇంతలా టీడీపీ ఆందోళన చెందుతోంది.  మరి ఫలితం ఎలా వస్తుందో చూడాలి.
    Published by:Nagesh Paina
    First published: