AP PANCHAYAT ELECTIONS POLICE GIVING HELPING HAND TO OLD AGE PEOPLE NGS
AP Panchayat electoins: ఈ పోలీసులు చేసిన పనికి శభాష్ అనాల్సిందే.. గ్రేట్ జాబ్ అంటున్న ఓటర్లు
విధి నిర్వహణలో ఎప్పుడూ కన్నెర్ర చేస్తూ.. నిరసన గళం వినిపించే వారిపై లాఠీలు ఝులిపిస్తూ కనిపించే ఖాకీలు.. పోలింగే కేంద్రాల దగ్గర మాత్రం హెల్పింగ్ హ్యాండ్స్ అవుతున్నారు. నడవలేని వారికి చేయూతనిస్తూ శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు.
విధి నిర్వహణలో ఎప్పుడూ కన్నెర్ర చేస్తూ.. నిరసన గళం వినిపించే వారిపై లాఠీలు ఝులిపిస్తూ కనిపించే ఖాకీలు.. పోలింగే కేంద్రాల దగ్గర మాత్రం హెల్పింగ్ హ్యాండ్స్ అవుతున్నారు. నడవలేని వారికి చేయూతనిస్తూ శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు.
ఏపీలో తుది దశ పోలింగ్.. కొన్ని చోట్ల ఉద్రిక్తతలు మినహా ప్రశంతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో భారీగా ఓటింగ్ నమోదవుతోంది. అన్ని పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు పోటెత్తుతున్నారు.. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీసు సిబ్బంది తీరు మాత్రం శెభాష్ అనిపిస్తోంది. తమకు ఎందుకులే అనుకోకుండా వృద్ధులకు, దివ్యాంగులకు సహాయపడుతూ సెల్యూట్ అనిపించుకుంటున్నారు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం రామన్నపేట పోలింగు కేంద్రం దగ్గర ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులకు సహాయపడ్డారు పోలీసులు, ఇతర సిబ్బంది.
పోలింగు కేంద్రం దగ్గర ఓటు వేసేందుకు వచ్చిన 90 సంవత్సారాల వృద్ధుడిని చేతులతో ఎత్తుకొని తీసుకొని వెళ్తున్న జామి ఎస్ఐ సుదర్శనరావు
కొత్తవలస మండలం గొల్లపాలెం పోలింగ్ కేంద్రం దగ్గర ఓటు వేసేందుకు వచ్చి.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని కుర్చీలో మోసుకుంటు వెళ్తున్న ఏఎస్ఐ నారాయణ రావు, ఇతర భద్రతా సిబ్బంది.
దత్తిరాజేరు మండలంలోని దత్తి పోలింగ్ కేంద్రం దగ్గర ఓటు వేసేందుకు వచ్చిన దివ్యాంగుడిని కుర్చీలో కూర్చోబెట్టి తీసుకువెళ్తున్న కానిస్టేబుల్ బ్రహ్హేష్
బొండపల్లి మండలం ఒంపల్లి పోలింగు కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చిన వృద్దులకు సహాయపడుతున్న భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులు.
బొండపల్లి మండలం రాయింద్రం పోలింగు కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలిని చేతులతో ఎత్తుకొని తీసుకొని వెళ్లారు.