AP Panchayat Elections: తుది విడత పోలింగ్ కు ముందు టెన్షన్ టెన్షన్: తూర్పుగోదావరిలో హత్యాయత్నం

AP Panchayat Elections: తుది విడత పోలింగ్ కు ముందు టెన్షన్ టెన్షన్: తూర్పుగోదావరిలో హత్యాయత్నం

ఏపీ పంచాయతీ తుది దశ పోలింగ్ కు ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల దాడులు, ఘర్షణలతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు.

ఏపీ పంచాయతీ తుది దశ పోలింగ్ కు ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల దాడులు, ఘర్షణలతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు.

  • Share this:
    ఏపీ పంచాయతీ ఎన్నికలు ముగిసేందుకు ఒక్కరోజే సమయం ఉంది. ఆదివారం మొత్తం నాలుగు విడతల పోలింగ్ ముగియనుంది. ఇప్పటికే మూడు విడతల ఫలితాలు కూడా వచ్చాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే మూడు దశల పోలింగ్ ముగిసింది. ఇఫ్పుడు ఆఖరి దశ పోలింగ్ కు ఒక్క రోజు ముందు కూడా పరిస్థితి భయపెడుతోంది. చాలాచోట్ల ఘర్షణలు హద్దులు దాటుతున్నాయి. ముందురోజే ఇలా ఉంటే.. పోలింగ్ రోజు పరిస్థితి ఏంటని సామాన్యులు భయపడుతున్నారు.

    తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచి అభ్యర్థిగా బరిలో నిలిచిన గంటా చంద్రకళ మరిది ప్రదీప్‌కుమార్‌పై దుండగులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. బాధితుడిని అమలాపురం కిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రదీప్‌కుమార్‌ పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ప్రత్యర్థి అభ్యర్థి మనుషులే ప్రదీప్ కుమార్ పై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు చంద్రకళ కుటుంబ సభ్యులు..

    నెల్లూరు జిల్లా కొడవలూరులో ఉద్రిక్తతి నెలకొంది. టీడీపీ మద్దతుదారురాలు నాగవేణి ఇంటిపై అర్ధరాత్రి వైసీపీ నేతలు దాడికి పాల్పడినట్టు ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పీఎస్ ఎదుట టీడీపీ శ్రేణులు బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

    శ్రీకాకుళంలోనూ ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. కింతలి పంచాయతీ ఖాజీపేటలో టీడీపీ వర్గీయు దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ మద్దతుదారులకు ఓట్లు వేయలేదని అక్కసుతో గత అర్ధరాత్రి యాదవ వీధిలో కర్రలు, గునపాలతో బీభత్సం సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరి ఇళ్లపై దాడులు చేసి కరెంటు మీటర్లు, ఇంటి తలుపులు, కిటికీలు, రెండు బైకులను ధ్వంసం చేశారని వైసీపీ వర్గీయులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    అనంతపురం జిల్లాలోని పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లో వైసీపీ రెబెల్ అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు స్థానిక నేతలు తమను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా తమపైనే కేసులు పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు విఘాతం కల్పిస్తున్నారని నోటీసు ఇచ్చి మరి నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఘర్షణలు.. ఉద్రిక్తతలపై ఫిర్యాదులు అందుతుండడంతో పోలింగ్ కు మరింత భద్రత ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమని పంచాయతీశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివజన్లు, 161 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 6,047 సమస్యాత్మక, అలాగే 4,967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామన్నారు. కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాటు చేశామని సెంటర్ల దగ్గర వీడియోలో రికార్డు చేస్తున్నామని ద్వివేది తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు