AP Panchayat Elections: తుది విడత ఎన్నికల్లో టెన్షన్ టెన్షన్.. వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

AP Panchayat Elections: తుది విడత ఎన్నికల్లో టెన్షన్ టెన్షన్.. వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.. పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ-టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఉన్నతాధికారులు మాత్రం ఎన్నికలు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.. పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ-టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఉన్నతాధికారులు మాత్రం ఎన్నికలు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
    ఏపీ పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. దాదాపు చాలా జిల్లాల్లో పోలింగ్దే కేంద్రాల వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

    నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఓటర్లను ఎత్తుకెళ్లిపోవడం కలకలం రేపింది. పైనాపురంలో తమకి ఓట్లు వేయరని భావించిన ఓ వర్గం నేతలు.. మూడు వందల మంది ఓటర్లని బస్సుల్లో తరలించి.. రొయ్యలగుంటల వద్ద నిర్భంధించారని మరో వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. తమకు ఓటు వేయరని భావించే ఇలా ఓటర్లు ఎత్తుకెళ్లిపోయారంటూ ఆందోళనకు దిగారు . దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు పోలింగ్ కేంద్రం దగ్గర ఆందోలనకు దిగారు.

    హోం మంత్రి సుచరిత నియోజకవర్గంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలింగ్ ఏజెంట్లపై ఓ వర్గం వారు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడ్డారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి ఘటన ముందుకు వరకు గ్రామంలోనే ఎస్పీ అమ్మిరెడ్డి వున్నారు. ఆయన వెళ్లిన తరువాతే వివాదం మొదలైంది.

    కర్నూలు జిల్లా ఆలూరు పోలింగ్ కేంద్రం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓటు వేసేందుకు వచ్చిన వారిని అధికార పార్టీ ఏజెంట్లు అడ్డుకుంటున్నారని.. తమకే ఓటు వేయాలని బెదిరిస్తున్నారంటూ టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రం దగ్గరే టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి.

    చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కందులవారిపాలెంలోనూ దొంగ ఓట్లపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఓ 20 మంది బయటవారిని గుర్తించి పోలీసులకు అప్పగించారు టీడీపీ నేతలు.

    ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం దరిమడుగులో భారీగా దొంగ ఓట్లు పోల్ అయ్యాయి. అసలు ఓటర్ల కంటే ముందుగానే వచ్చిన నకిలీ ఓటర్లు ఓట్లు వేసి వెళ్లారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దరిమడుగు ఇంజినీరింగ్ కాలేజీలో చదివే ఇతర జిల్లాల విద్యార్థులకు ఓట్లు వున్నాయి. పోలింగ్ ఏజెంట్లు, అధికారులు విద్యార్థులను గుర్తించలేకపోతున్నారు. తమ ఓటు ఇతరులు వేయడంపై అసలు ఓటర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు ఓటర్లకు పోలింగ్ అధికారులు టెండర్ ఓటు అవకాశం కల్పిస్తున్నారు.

    అయితే ఎన్నికల జరుగుతున్న తీరుపై ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం, విశాఖ జిల్లాల్లో పోలింగ్‌ సరళిని డీజీపీ సవాంగ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీజీపీ సవాంగ్‌ తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే చాలా వరకు ఘర్షణలు తగ్గాయన్నారు. పోలీసుల అప్రమత్తతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.
    Published by:Nagesh Paina
    First published: