కాబోయే ఏపీ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అదీ 2024లోనే..!

ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని పార్టీ పెద్దలు చెబుతున్న క్రమంలో ఓ టీడీపీ నేత 2024లో ఎన్టీఆరే సీఎం అని ఫ్లెక్సీలో ముద్రించాడు.

news18-telugu
Updated: January 16, 2020, 2:43 PM IST
కాబోయే ఏపీ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. అదీ 2024లోనే..!
జూనియర్ ఎన్టీఆర్ (jr ntr TDP)
  • Share this:
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. పార్టీలో చంద్రబాబు వారసుడిగా తెరపైకి వచ్చిన లోకేశ్.. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంతైనా ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తారక్‌ను రంగంలోకి దించాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు కూడా. తాజాగా, ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని పార్టీ పెద్దలు చెబుతున్న క్రమంలో ఓ టీడీపీ నేత 2024లో ఎన్టీఆరే సీఎం అని ఫ్లెక్సీలో ముద్రించాడు.

ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ (Photo:Facebook)


ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ నేతలు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూదాల అజితారావుకు శుభాకాంక్షలు చెబుతూనే, 2024లో ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ.. ఆయన ఫోటోను కూడా ముద్రించారు. ఆ ఫ్లెక్సీని పార్టీ కార్యకర్తలే ఏర్పాటు చేశారు. అయితే.. ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు.. సచివాలయంలో సీఎం చైర్‌లో ఎన్టీఆర్ కూర్చున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటో కూడా తెగ వైరల్ అవుతోంది.

మార్ఫింగ్ ఫోటో (Photo: Facebook)


Published by: Shravan Kumar Bommakanti
First published: January 16, 2020, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading