ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిగంటల్లోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)లోని పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేశారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి సతీష్ చందర్, ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, కార్యదర్శుల హోదాలో కొనసాగుతున్న గిరిజా శంకర్, అడుసుమిల్లి రాజమౌళిపై బదిలీ వేటు వేశారు. వీరంతా సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డి నియమించినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు టీమ్‌గా చెప్పుకునే అధికారులపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జగన్ బదిలీ వేటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే కొత్త నాయకులు... తమ ఆలోచనలకు అనుగుణంగా పని చేసే అధికారులకు సీఎంవో స్థానం కల్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎంవోలోని ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసినట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ప్రక్షాళన చేపడతానని ప్రకటించిన ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... మొదటగా సీఎంవో ఆఫీసులోని ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేయడం గమనార్హం.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.