• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP MUNICIPAL ELECTIONS TDP LEADERS DHARNA AGAINST MUNICIPAL OFFICIALS IN THIRUPATHI BK NGS

Municipal Elections: మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా చేసుకోలేదని అంత పని చేశారా?

Municipal Elections: మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా చేసుకోలేదని అంత పని చేశారా?

ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ.. విపక్షాలు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.

ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ.. విపక్షాలు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.

  • Share this:
    మున్సిపల్ ఎన్నికలతో ఏపీ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు కామన్ కావొచ్చు.. కానీ అధికారులే తమను వేధిస్తున్నారంటూ ఓ కార్పొరేటర్ అభ్యర్థి ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది.

    ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ.. విపక్షాలు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు తీరుపై ఎస్ఈసీకి ఫిర్యాదులు కూడా అందాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా అధికారుల తీరును తప్పుపడుతూ ఎస్ఈసీకి లేఖలు కూడా రాశారు.. అయినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.

    సరిగ్గా 20ఏళ్ళ తరువాత తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. పోటాపోటీగా కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 294 మంది బరిలో ఉన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు మునిసిపల్ కార్పొరేషన్ కుర్చీ మాదంటే మాది అంటూ ఇప్పటికే ప్రచారాలను పరుగులు పెట్టిస్తున్నారు. చాలాచోట్ల అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. అయితే అధికార పార్టీ మాత్రం ఏకగ్రీవాలపైనే ఫోకస్ చేసింది. దీనిలో భాగంగానే తనపై వేధింపులకు పాల్పడుతున్నారని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆరోపించారు.

    మొదటి సారి తిరుపతి మేయర్ పీఠానికి ఎన్నికలు జరుగుతుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకొని...మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఎలాగైనా 50 డివిజన్లో తమ అభ్యర్థులు గెలవాలని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు.

    తిరుపతి రైల్వే కాలనీ 43వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి ఆర్పీ లక్షీ భర్త ఆర్పీ శ్రీనివాసులకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది.  కానీ 43 డివిజన్ ను కైవసం చేసుకునేందుకు స్థానిక వైసీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. మొదట బలమైన అభ్యర్థిని నిలబెట్టి ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించినా అది సఫలం కాలేదు. అందుకే తనపై నేరుగా వేధింపులకు దిుగుతున్నారని శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ప్రాపర్టీలో తనకు ఉన్న దుకాణంను కూల్చి వేస్తామని బెదిరింపులకు దిగారని.. అయితే తన భార్య కార్పొరేటర్ పోటీ నుంచి వెనక్కు తగ్గేదే లెదలి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

    గత ఇరవై ఏళ్లుగా టీ దుకాణం ఇక్కడే ఉన్నప్పుడు రాని అడ్డు ఇప్పుడు ఎలా వచ్చింది అని స్థలం యజమాని మునిసిపల్ అధికారులను నిలదీశారు. స్థలం వివాదం కోర్టులో ఉందని.. ఆ స్థలం కాళీ చేయాలంటూ కోర్టు ఆర్డర్ తీసుకురావలని డిమాండ్ చేస్తున్నారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోనందుకే ఇలా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు భారీగా అక్కడకు చేరుకున్నారు. దుకాణం ముందు ధర్నా చేపట్టారు. అక్రమంగా షాపును కూల్చివేస్తే సహించబోమని మండిపడ్డారు. దింతో కూల్చివేతను తాత్కాలికంగా వాయిదా వేశారు మునిసిపల్ అధికారులు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు