AP Municipal Elections:చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు మున్సిపాలిటీల్లో గెలుపెవరిది?

ప్రతీకాత్మకచిత్రం

చిత్తూరు జిల్లా మున్సిపాలిటీ ఎన్నికలపై అందరి ఫోకస్ ఉంది. మొత్తం 7 మున్సిపాలిటీలలో రెండు కోర్టు పరిధిలో ఉన్నాయి. మిగిలిన 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 4 మున్సిపాలిటీల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

  • Share this:
    ఏపీ వ్యాప్తంగా మున్పిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇతర జిల్లాల కంటే చిత్తూరు ఎన్నికలు రాజకీయంగా తీవ్ర ఆసక్తి పెంచుతున్నాయి. ప్రతిపక్ష నేత సొంత జిల్లా కావడంతో ఇక్కడి ఎన్నికలపై అందరి కన్ను పడింది. ఏళ్ళ తరబడి ఎన్నికలు జరగని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మొదలుకొని జంట మునిసిపాలిటీలుగా పేరున్న నగరి-పుత్తూరు నగరపాలక సంస్థలాలు ఎన్నికలు నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. అలాగే తిరుపతికి ఇదే మొదటి కార్పొరేషన్ ఎన్నికలు కావడం ఒక విశేషం.

    జిల్లాలోని శ్రీకాళహస్తి., కుప్పం మున్సిపాలిటీ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్ లలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికలకు కావాల్సిన సామాగ్రిని సిబ్బందికి అందిచారు ఎన్నికల అధికారులు.

    చిత్తూరు జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలలో రెండు కోర్టు పరిధిలో ఉన్నాయి. మిగిలిన 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డులను అధికార వైసీపీ పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 4 మున్సిపాలిటీలైన పలమనేరు., మదనపల్లి, నగరి, పుత్తూరు మున్సిపాలిటీలకు జిల్లా కేంద్రం చిత్తూరు, ప్రధాన నగరమైన తిరుపతిలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.

    తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. తొలిసారి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతుండటంతో.. అధికార వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 50 డివిజన్లలో 22 డివిజన్లను ఇప్పటికే వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోగా.. మిగిలిన 27 డివిజన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. 7వ డివిజన్ కోర్టు పరిధిలో ఉండటంతో ఆ ఒక్క స్థానంలో ఎన్నికలు లేవు.

    చిత్తూరు కార్పొరేషన్ 50 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 37 ఏకగ్రీవమయ్యాయి. మరో 13 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మునిసిపాలిటీల విషయానికి వస్తే..4 మున్సిపాలిటీలలో
    ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోంది. పలమనేరు మునిసిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. ఇందులో 18 వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా.. 8వార్డులలో ఎన్నికలు జరుగుతాయి. వాణిజ్య కేంద్రంగా మారుతున్న మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండగా.. అందులో 15 ఏకగ్రీవం అయ్యాయి. అన్నీ అధికార పార్టీ కైవసం చేసుకుంది. మిగిలిన 29 వార్డులకు ఎన్నికలు జారుతాయి.

    జంట మున్సిపాలిటీగా పేరొందిన నగరి-పుత్తూరు మున్సిపాలిటీలలో మాత్రేమే అత్యల్పంగా ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. నగరి మున్సిపాలిటిలో 29 వార్డులలో 7 వార్డులు మాత్రమే ఏకగ్రీవం కాగా 22 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో 27 వార్డులలో ఒక్క వార్డు మాత్రమే ఏకగ్రీవం అయింది. మిగిలిన 26 వార్డులలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. కార్పొరేషన్/ వార్డులు జిల్లాలో మొత్తం 248 ఉండగా ఇప్పటికే 130 ఎలగ్రీవం అయ్యాయి. మిగిలిన 118 వార్డు/డివిజన్లకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలను ఏర్పాటు చేసారు. పోలింగ్ బూత్ లలో ఏర్పాట్లను డిప్యూటీ కలెక్టర్ లు..అధికారులు పరిశీలిస్తున్నారు
    Published by:Nagesh Paina
    First published: