AP MUNICIPAL ELECTIONS RESULT UPDATE YCP ALMOST CLEEN SWEEP GNT NGS
AP Municipal Elections Result: మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్.. సగానికిపైగా క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. సైకిల్ కు పంక్చర్, పగిలిన గ్లాసు.. వాడిన కమలం
ఫ్రతీకాత్మక చిత్రం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతోంది. ఫ్యాన్ దూకుడుకు విపక్షాలు పూర్తిగా చతికిలపడ్డాయి. సైకిల్ కు పంక్చర్ అయ్యింది. గ్లాసు పగిలి ముక్క ముక్కలైంది. కమలం పూర్తిగా వాడిపోయింది. దాదాపు చాలా జిల్లాల్లో అధికా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోంది.
ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడుతున్నాయి. చాలాచోట్ల వార్ వన్ సైడ్ అవుతోంది. ఎక్కడా ప్రతిపక్షాలు ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కనీపం 100 వార్డులును గెలుచుకుంటుందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ దిశగానే దూసుకుపోతోంది. ఈ ఫలితాల ద్వారా వైసీపీ సరికొత్త రికార్డ్ సృష్టించినట్టే కనిపిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ దిశగా వైసీపీ దూసుకుపోతోంది అని చెప్పాలి. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ హవా కొనసాగుతుంది. ఫ్యాన్ దూకుడుకుకు సైకిల్ పంక్చర్ అవ్వగా.. గ్లాసు పగలి ముక్కు ముక్కలు అయ్యాయి. కమలం పూర్తిగా వాడిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నాలుగు కార్పొరేషన్ లను వైసీపీ సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు చూస్తే కడప జిల్లాలో రాయచోటి, పులివెందుల, యర్రగుంట్లలో వైసీపీ విజయం సాధించింది. నెల్లూరు జిల్లాకు వస్తే నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరి, అనంతపురం జిల్లాలో మడకశిర, పుట్టపర్తిల్లో వైసీపీ గెలుపొందింది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో
తునిలో వైసీపీదే విజయం అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరును వైసీపీ సొంతం చేసుకుంది. గుంటూరు జిల్లాలో మాచెర్ల, రేపల్లె, వినుకొండ, సత్తెనపల్లెలో వైసీపీ గెలుపొందింది. దీంతో ఈ ఎన్నికలపై అమరావతి రాజధాని రైతుల ఉద్యమ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలోని పలాసను వైసీపీ సొంతం చేసుకుంది. విజయనగరం జిల్లా విషయానికి వస్తే సాలూరులో వైసీపీ గెలుపొందింది. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పుంగనూరు, పలమనేరు, మదనపల్లె మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, చీమకుర్తి, అద్దంకిల్లో వైసీపీ గెలుపొందింది. కర్నూలు జిల్లాలో గూడూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, డోన్, నందికొట్కూరు మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకుంది.
ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు ఫ్యాన్‌కే పట్టం కట్టారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. గుంటూరు జిల్లా మున్సిపాలిటీల్లో వినుకొండను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు గాను 21 చోట్ల వైసీపీ గెలుపొందింది. గుంటూరు కార్పొరేషన్ కూడా వైసీపీ సొంతమైంది.
చిత్తూరు జిల్లాలో మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. నగరి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. నగరిలో 29 వార్డులకు గాను15 చోట్ల వైసీపీ విజయం సాధించింది. గుంటూరు రేపల్లెలో అత్యధిక మున్సిపాలిటీలను వైసీపీ కైవలం చేసుకుంది. విజయనగరం జిల్లా విషయానికి వస్తే సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైసీపీ గెలుపొందింది. విశాఖ జిల్లా విషయానికి వస్తే యలమంచిలి లో ఒక వార్డులో వైసీపీ గెలుపొంది. నందిగామలో 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఒంగోలు కార్పొరేషన్లో 19 డివిజన్లలో అధికార పార్టీ జెండా ఎగిరింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీని కూడా వైసీపీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వస్తున్న ఫలితాలు అధికార పార్టీకి ఏపీలో తిరుగులేదని చెబుతున్నాయి. ప్రతిపక్షాలకు ఓటర్లు షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఎక్కడ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్టు కనిపించలేదు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.