• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • AP MUNICIPAL ELECTIONS RESULT UPDATE FIRST RESULT FAVORS TO YCP NGS

Ap Municipal Elections counting: మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ జోరు: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తొలి ఫలితాలు ఇలా ఉన్నాయి

ఏపీ మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ జోరుకు తిరుగులేకుండా ఉంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటు.. తొలి రౌండ్ ఫలితాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.

ఏపీ మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ జోరుకు తిరుగులేకుండా ఉంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటు.. తొలి రౌండ్ ఫలితాల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.

  • Share this:
    ఏపీ మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఊహించినట్టే వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ భారీగా గెలుస్తుంది అంటూ అధికార పార్టీ లెక్కలు వేసుకుంది. ఫలితాలు కూడా అలానే వస్తున్నాయి. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అధికార పార్టీకి తిరుగులేకుండా పోతోంది.

    విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీ లు, నెల్లిమర్ల నగరం పంచాయతీకి పోలింగ్ కొనసాగుతుండగా..
    ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యింది.

    మొత్తం 24 వార్డులకు గాను 26 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ 18 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 6 ఓట్లు నమోదయ్యాయి.

    మిగిలిన 2 ఓట్లు చెల్లని ఓట్లు గా గుర్తించారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి తిరుగులేకుండా పోయింది.

    ఇప్పటి వరకు తొలి ఫలితాలు ఇలా ఉన్నాయి.
    పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    పాలకొండ నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    పార్వతీపురం మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    యలమంచిలి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    అమలాపురం మున్సిపాలిటీ 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    రామచంద్రపురం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    సామర్లకోట మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    తుని మున్సిపాలిటీలో 15 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    ముమ్మిడివరం నగర పంచాయతీ 1 వార్డులో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    కొవ్వూరు మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    నరసాపురం మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    తెనాలి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    చిలకలూరిపేట మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    రేపల్లె మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    సత్తెనపల్లి మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    వినుకొండ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    కనిగిరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    నాయుడుపేట మున్సిపాలిటీలో 23 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    వెంకటగిరి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    నూజివీడు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    గుంతకల్లు మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    తాడిపత్రి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 9 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీగెలుపు
    జమ్మలమడుగు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    బద్వేల్ మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
    ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలు వైఎస్సార్‌ సీపీ కైవసం
    పులివెందుల, మాచర్ల మున్సిపాలిటీలు వైఎస్సార్‌ సీపీ కైవసం
    పుంగనూరు, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్‌సీపీ కైవసం
    Published by:Nagesh Paina
    First published: