• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • AP MUNICIPAL ELECTIONS RESULT TPD WILL WIN THADIPATRI MUNICIPALITY NGS

Ap Municipal Elections Result: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ బోణి! తొడగొట్టి నెగ్గిన బ్రదర్స్

జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అశ్మిత్(Image: Facebook)

ఏపీ వ్యాప్తంగా వైసీపీ జోరు కొనసాగుతుంటే.. ఒక్క మున్సిపాలిటీలో మాత్రం టీడీపీ తొడగొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంటే.. అక్కడ మాత్రం టీడీపీ గెలుపొందడం విశేషం.

  • Share this:
    ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ తిరుగులేకుండా దూసుకుపోతోంది. 11 కార్పొరేషన్ లకు గాను.. ఇప్పటికే 5 కుపైగా వైసీపీ సొంతం చేసుకుంది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే 55కి పైగా వైసీపీ ఖాతాలోనే చేరుతున్నాయి. అంటే 85 శాతం మున్సిపాలిటీలను అధికార పార్టీ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తోంది. మిగిలిన చోట్ల కూడా వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిక్షం చాలా చోట్ల అసలు వార్డులు, డివిజిన్లు గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. చాలాచోట్ల అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోంది. ఇలాంటి సమయంలో టీడీపీ పరువు కాపాడారు ఆ ఇద్దరు బ్రదర్స్..

    అనంతపురం విషయానికి వస్తే రాయదుర్దం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో అధికార వైసీపీ సత్తా చాటుతోంది. మెజార్టీ మున్సిపలిటీల్లో అధికార పార్టీకి తిరుగులేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధిక్యంలో ఉన్నా.. ఒక్క మున్సిపాలిటీ మాత్రం వైసీపీకి షాక్ ఇచ్చింది. అదే తాడిపత్రి నియోజకవర్గం..  తాడిపత్రి మున్సిపాలిటీ మొత్తం వార్డులు 34 ఉండగా,  టీడీపీ అత్యధికంగా 18 చోట్ల, వైసీపీ 14 చోట్ల నెగ్గాయి. మరోవైపు సీపీఐ 1, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలుపొందింది. ఆ రెండు సీట్లు కూడా టీడీపీ తమవే అంటోంది. తమ మద్దతు దారులే రెండు చోట్ల గెలిచారని జేసీ స్పష్టం చేశారు. దీంతో టీడీపీకి 20 సీట్లు రాగా..  వైసీపీ 14 సీట్లకు పరిమితం అయ్యింది. ఇక్కడ ఏకగ్రీవాలు, ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో కలుపుకున్న టీడీపీదే విజయం అని చెప్పాలి.

    మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపాలిటీలోని 24వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఆయన చైర్మన్ గిరీని ఆయన సొంతం చేసుకునే అవకాశం ఉంది. గతంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేపీ ప్రభాకర్ రెడ్డి పని చేశారు. ఉమ్మడి ఏపీలో తాడిపత్రి మున్సిపాలిటీకి ఆయన చైర్మన్ గా పని చేశారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా ఉన్నారు.

    ఈ ఇద్దరు సోదరుల ప్రభావంతోనే తాడిపత్రిలో టీడీపీ విజయం సాధించింది అని చెప్పొచ్చు.. ఎందుకంటే రాష్ట్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో వైసీపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. చాలా చోట్ల అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయినా ఆ గాలి తట్టుకుని జేసీ బ్రదర్స్ తమ సత్తా చూపారు. ముఖ్యంగా తనకు నామినేషన్ వేసే అవకాశం కూడా ఇవ్వకుండా వైసీపీ అడ్డుపడుతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు తనను ప్రచారం చేయనీయకుండా అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కాలంలో రాజకీయంగా అత్యధిక కేసులు నమోదు అయ్యింది జేసీ ప్రభాకర్ రెడ్డి మీదే. అయినా ఇన్ని ప్రతికూలతల మధ్య తాడిపత్రిలో టీడీపీ గెలుపొందుతుండడం విశేషం.
    Published by:Nagesh Paina
    First published: