• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • AP MUNICIPAL ELECTIONS RESULT TDP SHOCK TO YCP IN BOBBILI MUNICIPALITY NGS

AP Municiapl Elections Result: వైసీపీకి షాక్ ఇస్తున్న టీడీపీ ఎక్కడో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ వ్యాప్తంగా వైసీపీ జోరు కొనసాగుతుంటే.. ఒక్క చోట మాత్రం టీడీపీ అధికార పార్టీకి షాక్ ఇస్తోంది. అది కూడా వైసీపీకి ప్రస్తుతం పూర్తిగా పట్టు ఉన్న జిల్లాలో.. మరి తుది ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

  • Share this:
    ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, వార్డులు, డివిజన్లు ఇలా తేడా లేకుండా అన్ని చోట్ల వైసీపీ తిరుగులేని విజయాలు సాధిస్తోంది. 11 కార్పొరేషన్లు ఉంటే.. ఇప్పటికే 5 కార్పొరేషన్లను వైసీపీ సొంతం చేసుకుంది. మిగిలిన అన్ని చోట్లా వైసీపీ ఆధిక్యం కనిపిస్తోంది. ఇలా ప్రస్తుతం ఎన్నికల ఫలితాల ట్రెండ్ చూస్తుంటే వైసీపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా కనిపిస్తోంది. చాలా చోట్ల సంబరాలు కూడా మొదలయ్యాయి..

    రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ జోరు కనిపిస్తుంటే.. ఒక్క చోట మాత్రం ప్రధాన ప్రతిపక్షం.. అధికార వైసీపీకి షాక్ ఇస్తోంది. అది కూడా వైసీపీకి పూర్తి పట్టు ఉన్న చోట కావడం విశేషం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలను చూస్తే.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లా మూడు చోట్ల వైసీపీ అత్యధిక స్థానాల్లో నెగ్గింది. పూర్తి ఫలితాలు రాకపోయినా.. మెజార్టీ మున్సిపాలిటీలు వైసీపీ సొంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బొబ్బిలి మున్సిపాలిటీలో మాత్రం టీడీపీ ప్రస్తుతం ఆధిక్యం దిశగా దూసుకుపతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు చూస్తే.. అధికార వైసీపీ 7 చోట్ల గెలుపొందితే.. ప్రతిపక్ష టీడీపీ 10 చోట్ల గెలుపొంది. ఏపీ వ్యాప్తంగా చూస్తే ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే టీడీపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. కానీ తుది ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి..

    అయితే ఇక్కడ టీడీపీ ఆధిక్యత సాధించడానికి ప్రధాన కారణం ఆ పార్టీకి చెందిన నేతలు తీవ్రంగా శ్రమించారని చెప్పాలి. బొబ్బలి పార్లమెంట్ ఇంఛార్స్ బేబీ సునయన మొత్తం ప్రచారాన్ని దగ్గరుండి చూసుకున్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగారు. అందుకే ఫలితాలు కాస్త అనుకూలంగా వస్తున్నాయి. మరి తుది ఫలితాలు టీడీపి ఆనందాన్ని ఇస్తాయో లేదో చూడాలి..

    ఇక మిగిలిన మున్సిపాలిటీల విషయానికి వస్తే.. కర్నూలు జిల్లాలో ఆత్మకూరు(కె), నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూర్, ఆళ్లగడ్డలను వైసీపీ సొంతం చేసుకుంది. కడప జిల్లాలో పులివెందులు, బద్వేల్, రాయచోటి, ఎర్రగుంట్లలో వైసీపీ గెలుపొందింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగిరి, పూత్తురుల్లో విజయం సాధించింది. అయితే నగరి మున్సిపాలిటీపై కొంత ఉత్కంఠ ఉండేంది. ఎక్కువమంది వైసీపీ రెబల్స్ బరిలో నిలవడం.. దానికి తోడు స్వయనా ఎమ్మెల్యే రోజా మీడియా ముందుకు వచ్చి తనను ఓడించేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో ఆ ఫలితంపై ఆసక్తి ఉండేది. కానీ రోజా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు.

    ప్రకాశం జిల్లాలో టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకోపయింది. కనిగిరి, గిద్దలూరు, మర్కాపురం, చీమకుర్తి, అద్దంకిల్లో గెలుపొందింది. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, ఆత్మకూరు, చీరాల, సూళ్లురుపేట, నాయుడుపేటల్లో వైసీపీ జెండా ఎగిరింది. గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, మాచెర్ల, రేపల్లె, వినుకొండ, పిడుగురాళ్ల మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకుంది. అధికారికంగా వెలువడిన ఫలితాలు చూస్తే కడప, తిరుపతి, గుంటూరు కార్పొరేషన్‌లు వైసీపీ సొంతమయ్యాయి. ఇక మిగిలిన కార్పొరేషన్లలలోనూ వైసీపీ ఆధిక్యంలోనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
    Published by:Nagesh Paina
    First published: