Home /News /politics /

AP MUNICIPAL ELECTIONS COUNTING UPDATE NGS

AP Municipal counting: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల దగ్గర గందరగోళం: ఏజెంట్ల అనుమతి నిబంధనలపై ఆందోళనలు

 మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రస్తతం గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం , విజయనగరం కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రస్తతం గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం , విజయనగరం కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రస్తతం గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం , విజయనగరం కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

    ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 13జిల్లాల్లో జరిగిన పురపోరులో 11 కార్పొరేషన్లు…71మున్సిపాలిటీలకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ ఫలితాలను మాత్రం హైకోర్టు ప్రకటించవద్దని ఆదేశించింది. దీంతో 10 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు మాత్రమే వెలువడనున్నాయి. అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభ సమయంలోనే చాలా చోట్ల గందరగోళం నెలకొంది.

    ముఖ్యంగా ఏంజెన్లను అనుమతించే విషయంలో అధికారులతో ఆయా పార్టీలు గొడవకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా ఆదోనిలోని, విశాఖ జిల్లా నర్సీపట్నంలోనూ, విజయనరగం జిల్లా కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం.. ముగ్గురు ఏజెంట్లకు అనుమతి ఉందని.. కానీ అధికారులు మాత్రం అభ్యర్థితో పాటు ఇద్దరు ఏజెంట్లనే పంపిస్తున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో పలు చోట్ల కౌంటింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.

    ఈ గొడవలు ఎలా ఉన్నా.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం తీవ్ర ఉత్కంఠ పెంచుతున్నాయి. ప్రస్తతం గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం , విజయనగరం కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

    11కార్పొరేషన్‌ల ఫలితాల్లో కూడా విజయవాడ, గుంటూరు రిజల్ట్స్ కీలకంగా మారాయి. రాజధాని మార్పుకి ప్రభుత్వం ఆమోదించడంతో…ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు విశాఖ కార్పొరేషన్ ఫలితంపై కూడా సందిగ్ధం నెలకొంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంతో ఇక్కడి ఓటర్లు అధికార వైసీపీని గెలిపిస్తారా ? ప్రతిపక్ష పార్టీలను ప్రోత్సహిస్తారా ? అన్నది కాసేపట్లో తెలనుంది.

    రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన బెజవాడలో బల్దియా పోరులో విజయం ఎవర్ని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ తరపున ఎంపీ కేశినేని నాని కూతురు మేయర్ అభ్యర్థిగా ఉండడం.. అక్కడ వైసీపీకీ ఎక్స్ అఫియో బలం ఎక్కువగా ఉండడంతో జెజవాడపై అందరి ఫోకస్ పడింది. అయితే టీడీపీలో వర్గ పోరు కూడా ప్రధాన అంశంగా మారింది. అందుకే ఈ ఫలితం ఎలా ఉంటుంది అన్నదానిపై అందరిలో ఆసక్తి పెరిగింది.

    గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల బరిలో తొలిసారి బరిలో నిలిచింది అధికార వైసిపి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడమే ఇందుకు కారణం. తొలి సారి పోటీతోనే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది వైసిపి. మరోవైపు ఇక్కడ సత్తా చాటాలని భావిస్తోంది టీడీపీ. ముఖ్యంగా అమరావతి ఉద్యమం.. రాజధాని తరలింపు అంశాలు తమకు ప్లస్ అవుతాయని టీడీపీ భావిస్తోంది. అధికార పార్టీ మాత్రం ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

    ఏపీ వ్యాప్తంగా విశాఖ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.. అన్ని ప్రధాన పార్టీలు మేయర్ పీఠాన్ని టార్గెట్ చేశాయి. ముఖ్యంగా వైసీపీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. వైజాగ్ ను పరిపాలన రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఎలా అన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది? విపక్షాలు సైతం ప్రజామోదం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఎన్నికల ముందురోజే విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రకటన చేసింది. వంద శాతం ప్రైవేటీకరణ తప్పదని తేల్చి చెప్పేసింది. అప్పటికే విశాఖ ఉద్యమం తీవ్రమైంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కోపంతో ఉన్న ఓటర్లకు తమకు పట్టం కడతారని టీడీపీ భావిస్తోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Guntur, Municipal Elections, Vijayawada, Visakhapatnam, Vizag

    తదుపరి వార్తలు