AP MUNICIPAL ELECTIONS COUNTING LIVE UPDATE YCP CLEENSWEEP GNT NGS
Ap Municipal Elections Result: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో హాఫ్ సెంచరీ దిశగా వైసీపీ..? కనిగిరి సహా పలు చోట్ల క్లీన్ స్వీప్
హాఫ్ సెంచరీ దిశగా వైసీపీ
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతోంది. మెజార్టీ మున్సిపలిటీలను వైసీపీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. చాలాచోట్ల క్లీన్ స్వీప్ చేస్తోంది వైసీపీ. ఒకటి రెండు చోట్ల మినహా టీడీపీ పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది.
ఎన్నిక ఏదైనా.. ప్రాంతం ఎక్కడైనా..? ఫలితం తమదే అంటోంది వైసీపీ, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దూకుడుకు తిరుగులేకుండా పోతోంది. ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోతున్నాయి. కొన్ని చోట్లకు మాత్రమే టీడీపీ పరిమితం అవ్వగా.. నాలుగైదు సీట్లకు జనసేన -బీజేపీ కూటమి పరిమితం అవుతోంది. కర్నూలు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 30 శాతం మున్సిపాలిటీల్లో వైసీపీ జెండా ఎగిరింది. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే కచ్చితంగా హాఫ్ సెంచరీ కొట్టే దిశగా దూసుకుపోతోంది.
ఇక కనిరిగి మున్సిపాలిటీలో వైసీపీకి తిరుగులేకుండా పోయింది. 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్‌స్వీప్ చేసింది. డోన్ లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఓవారాల్ గా చూస్తే 25కు పైగా మున్సిపాలిటీలను వైసీపీ సొంతం చేసుకుంది. ఇంకా చాలా స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ప్రకాశం జిల్లాలోనూ వైసీపీ జెండా రెపరెపలాడింది. గిద్దలూరు మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు స్థానాల్లో ముందంజలో ఉంది. వీటితో పాటు జంగారెడ్డి గూడెం, మదనపల్లి, రాయచోటి, మాచెర్ల, పిడురాళ్ల, సూళ్లూరుపేట, పులివెందుల, పుంగనూరు, డోన్, నాయుడుపేట, ఆత్మకూరు, పలమనేరు, కొవ్వూరు, మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. గుంటూరు సిటీ 7 వ డివిజన్ వైసీపీ గెలుపొందింది. 1700 ఓట్ల మెజారిటీ దక్కింది. 26వ డివిజన్ లోనూ వైసీపీ అభ్యర్థి 1200 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది.
ఇటు పోస్టల్ బ్యాలెట్‌ల్లో వైఎస్ఆర్సీపీదే ఆధిక్యం ఉంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ దాదాపు వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. మరోవైపు తీవ్ర ఉత్కంట రేపిన సత్తెనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డులో వైసీపీ అభ్యర్థి చుక్కా శాంతి శ్రీ సాగరిక 358ఓట్లతో గెలుపొందారు. విజయనగరం జిల్లాలోనూ వైసీపీ దూకుడుగా దూసుకుపోతోంది. నెల్లిమర్ల నగర పంచాయతీ మొదటి పది వార్డుల పలితాలు వెల్లడైతే.. 2,3,4,5,7,8 వార్డుల్లో వైసిపి విజయం సాధించింది. 1,6,10 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. 9 వార్డులో వైసిపి రెబల్ అభ్యర్థి గెలుపొందారు. అయితే వైసీపీ చైర్మన్ అబ్యర్ధి ఓడిపోవడం విశేషం.
గూడూరు నగర పంచాయతీలోనూ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మొత్తం వార్డులు ఉండగా.. వైపీపీ 13చోట్ల, బీజేపీ ఒకటి, టీటీడీ 2, ఇండిపెండెంట్స్ 4 చోట్ల గెలుపొందారు. వినుకొండలో మొత్తం 32 వార్డులు ఉండగా.. 7 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవంగా నెగ్గింది. మిగిన 25 చోట్ల పోలింగ్ జరగ్గా 21 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ 4 వార్డులకే పరిమితం అయ్యింది. దీంతో ఏకగ్రీవాలతో కలిపి 32 వార్డుల్లో వైసీపీ ఖాతాలో 28 వార్డులు ఉండగా.. టీడీపీ నాలుగు వార్డుల్లో గెలుపొందింది. దాదాపు చాలాచోట్ల ఫలితాలు ఇలానే ఉన్నాయి.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.