Home /News /politics /

AP MUNICIPAL ELECTIONS CANDIDATES DOOR TO DOOR EARLY MIRING CAMPAIGN NGS

Andhra Pradesh:తెల్లవారు జామున 5 గంటలకే మోగిన కాలింగ్ బెల్.. ఓపెన్ చేసి షాక్ తింటున్న ఇంటి ఓనర్లు

తెల్లవారు జామున మోగుతున్న కాలింగ్ బెల్

తెల్లవారు జామున మోగుతున్న కాలింగ్ బెల్

ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ లాంటి నగరాల్లో తెల్లవారు జామునే కొందరి  కాలింగ్ బెల్ లు మోగుతున్నాయి. తీరా తలుపులు చూసిన వారంతా షాక్ కు గురవుతున్నారు.

    తెల్లవారు జామున ఫోన్ వచ్చినా.. మెలుకువ రాక ముందే కాలింగ్ బెల్ మోగిన కాస్త టెన్షన్ పడుతుంటాం.. ఇంత పొద్దున ఫోన్ వచ్చింది ఏంటి? ఎవరికైనా ఏదైనా జరిగిందా అని భయపడుతూ ఫోన్ తీస్తాం.. తెల్లవారు జామునే కాలింగ్ బెల్ మోగినా అదే పరిస్థితి ఉంటుంది. నిద్ర మత్తులో ఉంటే ఇంత పొద్దున్న ఎవరు తలుపుకొడుతున్నారు బాబు అంటూ తింటుకుంటాం.. లేదా ఏమై ఉంటుంది. ఇంత తెల్లవారున కాలింగ్ బెల్ మోగిందని భయపడుతుంటాం..

    ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ లాంటి నగరాల్లో తెల్లవారు జామునే కొందరి  కాలింగ్ బెల్ లు మోగుతున్నాయి. తీరా తలుపులు చూసిన వారంతా షాక్ కు గురవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సమయం ఎక్కువ లేకపోవడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు అన్ని పార్టీల వారు.  అన్ని మున్సిపాలిటీల్లో లాంగ్ గ్యాప్ తరువాత ఎన్నికలు జరుగుతుండడంతో ఎలాగైనా గెలుపొందాలని కంకణం కట్టుకున్నాయి అన్ని పార్టీలు.

    ఇందులో భాగంగా పార్టీ పెద్దలు ఇప్పటికే అభ్యర్థుల తరపున కాళ్లకు చక్రాలు కట్టుకుని ప్రచారాలు చేస్తున్నారు.. అయినా ఇంకా గెలుపుపై ఏదో భయం వెంటాడుతోందో? లేక ఎలగైనా గెలవాలి అనుకుంటున్నారో.. అభ్యర్థులు.. వారి సన్నిహితులు మాత్రం జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం సర్వ సాధారణమే.. అయితే పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు కావడంతో ఓటర్లను వెతికి పట్టుకోవడంలో అభ్యర్థులకు కత్తిమీద సాములా మారుతోంది. చాలా చోట ఇంటికి వెళ్లినా ఆడవాళ్లు.. లేదా పని వాళ్లు మాత్రమే ఇంట్లో దర్శనమిస్తున్నారు.. కొంతమంది ఇంట్లో ఉన్నా.. మాకుం టైం లేదు బయటకు వెళ్లాలి అని తలుపులు వేసేస్తున్న ఘటనలు దర్శనమిస్తున్నాయి..

    ఎందుకంటే పట్టణాల్లో చాలామంది ప్రైవేటు కంపెనీల్లో, ప్రైవేటు కాలేజీల్లో పని చేసేవాళ్లు.. ఉదయాన్ని ఏడు గంటల లోపే బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉంది. మళ్లీ వారు వచ్చేసరికి రాత్రి అయిపోతోంది. కొన్ని చోట్ల భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తుంటారు. మరికొంతమంది మార్నింగ్ షిప్ట్ డ్యూటీలకు వెళ్లేవాళ్లు ఉంటున్నారు. అంటే వారు 5 గంటలకే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి ఓటర్లను పట్టుకోవడం అభ్యర్థులకు కష్టమవుతోంది. దీంతో చుట్టు పక్కల వారిని.. ఆ ఇంట్లో వాళ్లు ఎప్పుడు ఉంటారని ఆరా తీస్తున్నారు. అయితే ఉదయం ఏడు గంటలలోపే బయటకు వెళ్లిపోతారని.. మళ్లీ రాత్రి ఎప్పుడో వస్తారని చెప్పడంతో.. అభ్యర్థులు రూటు మారుస్తున్నారు.. తెల్లవారు 5 గంటలకే ఇంటిముందు వాలిపోయి కాలింగ్ బెల్ కొడుతున్నారు.

    ఇంత పొద్దునే ఎవరు అని తలుపుతీస్తే.. చేతిలో పాంప్లెట్లు.. చిన్న చిన్న కానుకలు పట్టుకుని ఆయా పార్టీల తరపున అభ్యర్థులు దర్శనమిస్తున్నారు. ఇంత పొద్దున వచ్చారేంటి అని ప్రశ్నిస్తే.. ఎన్నిసార్లు వచ్చినా మీరు దొరకడం లేదని.. అందుకే ఇంత పొద్దునే రావాల్సి వచ్చిదంటూ చేతిలో ప్రచరా పత్రాలు.. చిన్న చిన్న గిఫ్లులు లేదా నగదు చేతిలో పెట్టి ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. అయితే వారి ముందు ఏమి అనలేకపోయిన ఉద్యోగులు.. తెల్లవారు జామున వీరి బాదేంటిరా బాబు అని భారంగా నిట్టూరుస్తున్నారు..
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, Municipal Elections, Vijayawada, Visakha, Visakhapatnam, Vizag

    తదుపరి వార్తలు