Home /News /politics /

AP MUNICIPAL ELECTIONS CAMPAIGN CANDIDATES READY TO RENOVATION APARTMENTS FOR VOTE NGS

AP Municipal Elections: అపార్ట్ మెంట్ కు మరమ్మత్తులు చేయాలా? పెయింటింగ్స్ వేయించాలా? మేమున్నాం.. మేం చూస్తామంటూ పోటీ

మేం ఉన్నాం.. మేం చూస్తామంటున్న అభ్యర్థులు

మేం ఉన్నాం.. మేం చూస్తామంటున్న అభ్యర్థులు

అపార్ట్ మెంట్ కు మరమ్మత్తులు చేయించాలన్నా.. పెయింటిగ్స్ వేయించాలి అన్నా.. అదో పెద్ద తతంగం. కమిటీలో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి.. ఫ్లాట్ ఓనర్లు అంతా అందుకు ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడు మేమున్నాం .. మేం చూస్తామంటూ ముందుకొస్తున్నారు కొందరు. ఇంతకీ ఎవరు వారు అనుకుంటున్నారా?

ఇంకా చదవండి ...
    నగరాల్లో ప్రస్తుతం అంతా అపార్ట్ మెంట్ కల్చరే ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఇండివిడ్యువల్ ఇళ్లకు అయితే పండగలప్పుడూ.. ఫంక్షన్ల సమయంలో.. లేదా మూడేళ్లకు ఒకసారో మరమ్మత్తులు చేయిస్తుంటారు.. పెయింటింగ్స్ కూడా వేయిస్తుంటారు. కానీ అపార్టు మెంట్ల పరిస్థితి వేరు.. దానికి కమిటీలో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి.. ఫ్లాట్ ఓనర్లు అంతా అందుకు ఒప్పుకోవాలి. అందుకే మరమ్మత్తుల చేయించాలి అంటే అదో పెద్ద తతంగం.. కానీ ఇప్పుడు మేమున్నాం .. మేం చూస్తామంటూ ముందుకొస్తున్నారు.. ఇంతకీ ఎవరు వారు అనుకుంటున్నారా?

    ఏపీ వ్యాప్తంగా నగరాల్లో ప్రస్తుతం ఎన్నికల కోలాహాలం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి.. గెలుపుకోసం ఏం చేయడానికైనా ఆయా పార్టీల అభ్యర్థులు సై అంటున్నారు. ముఖ్యంగా ప్రలోభాల పర్వం భారీగా కొనసాగుతోంది. సాధరణంగా పల్లెల్లో ఎన్నికలు అంటే మద్యం ఏరులై పారుతుంది. ఓటుకు ఇంత అంటూ లేదా కుటుంబానికి ఇంత అని నగదు బేరమడుకుంటారు. ఇప్పుడు నగర ఎన్నికలు కావడంతో ట్రెండ్ మారుస్తున్నారు అభ్యర్థులు.

    పట్టన ఓటర్లు కొందరు నగదు తీసుకోడానికి అంత ఇష్టపడరు.. అందుకే వారికి గృహోపకరణాలు ఇస్తూ ప్రలోభాలకు పాల్పడుతున్నారు. చీరలు, కుక్కర్లు.. కొన్ని చోట్ల రిఫ్రిరిజిరేటర్లు, ఏసీలు ఇలా ఆయా వార్డుల్లో పోటీని బట్టి ప్రలోభాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. అయినా ఓట్లు పడతాయో లేదో నమ్మకం కుదరడం లేదు.. దీంతో ఇప్పుడు అపార్ట్ మెంట్లను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

    చాలాచోట్ల గట్టిపోటీ ఉండడంతో కొంతమంది అభ్యర్థులు.. అపార్ట్ మెంట్ అధ్యక్షుడు, కార్యదర్శిలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అపార్ట్ మెంట్ లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం  ఓటర్లు ఎంతమంది ఉంటారు?  అందరూ తమ పార్టీకే ఓటు వేయాలి అంటే ఏం చేయాలి..అంటూ? కొందరు అభ్యర్థులు ఆరా తీస్తున్నట్టు  సమాచారం. అయితే అప్పటికే ఫలనా అభ్యర్థి మాకు ఈ ఆఫర్ ఇచ్చాడని సమాధానం వస్తుండడంతో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. ఓవరాల్ అపార్ట్ మెంట్ మొత్తానికి కొంత నగదు  అని కొందరు ఆఫర్ చేస్తుంటే.. మరికొందరు రూటు మార్చురు.. మీ అపార్ట్ మెంట్ కు మరమ్మత్తులు చేయించాలా..? లిఫ్టులు పాడయ్యాయా..? పెయింటింగ్స్ వేయించాలా..? మీకెందుకు టెన్షన్ మేం ఉన్నాం.. మేం చూసుకుంటా అంటూ ముందుకు వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా అపార్ట్ మెంట్లకు ఈ హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వాటికి కొన్ని కండిషన్లు పెడుతున్నారంట?. గెలిస్తేనే ఇవన్నీ చేస్తామని.. అప్పటి వరకు ఎవరికీ చెప్పొద్దు అంటూ మాట తీసుకుంటున్నారు అంట? అందుకు గాను అపార్ట్ మెంట్ సభ్యుల ముందే హామీ పత్రాలు కూడా ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఈ పార్టీ.. ఇండిపెండ్లట్లు అని తేడా లేకుండా.. అక్కడ పోటీని బట్టి ఇలా కొత్త కొత్త ప్రలోభాలకు తెరలేపుతున్నారు అభ్యర్థులు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap local body elections, AP News, Municipal Elections, Visakha, Visakhapatnam, Vizag

    తదుపరి వార్తలు