• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP MPTC ZPTC ELECTIONS UPDATE FIGHTING BETWEEN TDP AND YCP LEADERS NGS

AP MPTC ZPTC Elections: పరిషత్ ఎన్నికల్లో ఫైటింగ్. వైసీపీ -టీడీపీ నేతల మధ్య ఘర్షణ

AP MPTC ZPTC Elections: పరిషత్ ఎన్నికల్లో ఫైటింగ్. వైసీపీ -టీడీపీ నేతల మధ్య ఘర్షణ

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘర్షణలు

ఏపీలో పరిషత్ ఎన్నికల పొలింగ్ హీట్ పుట్టిస్తోంది. ఓ వైపు ఈ ఎన్నికలను బహిష్కరించినట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించినా.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చాలాచోట్ల టీడీపీ - వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల ఈవీఎం బాక్సులను ఎత్తుకెళ్లిన ఘటనలు కూడా కలకలం రేపుతున్నాయి.

  • Share this:
    ఏపీలో పరిషత్ ఎన్నికల్లో చాలాచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ వైపు ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధిష్టానం ప్రకటించినా.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు భారీగా ఓటర్లు క్యూ కడుతున్నారు.. కొన్ని చోట్ల పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.  శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపతాపల్లి పోలింగ్ కేంద్రం దగ్గర స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఎవరూ వినలేదు. దీంతో ఇరువర్గీయులను పోలీసులు బయటకు పంపేశారు.

    గుంటూరు రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో ఎస్టీ కాలనీలో అర్థరాత్రి నంచే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాలు దాడులు చేసుకున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నగదు పంపిణీ విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం ఘర్షణకు దారి తీసింది.

    చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కోనాపల్లె గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను వైసీపీ నేతలు అడ్డుకున్నట్టు కొందరు ఓటర్లు ఆరోపించారు. టీడీపీ సానుభూతుపరులమనే కారణంతోనే తమపై దాడికి దిగారని ఆరోపించారు. మరోవైపు చంద్రగిరిలో పోలింగ్ బూత్ ముందు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కడప జిల్లా
    బద్వేలులోని ఉత్తపత్తి వారి పల్లిలో టీడీపీ ఏజెంట్ స్థానంలో వైసీపీ ఏజెంట్లు రావడంతో గందరగోళం నెలకొంది. అయితే అధికారాపార్టీ నేతలకు పోలింగ్ సిబ్బంది వత్తాసు పలుకుతున్నారంటూ టీడీపీ అభ్యర్థి శిరీష్ రెడ్డి, ఇతర ఏజెంట్లు ఆందోళనకు దిగారు.

    ఇక అనంతపురం జిల్లా రాప్తాడులో పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ ఏజెంట్లను పోలీసులు బయటకు పంపించేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ఏజెంట్‌గా కూర్చుంటే కేసులు నమోదు చేస్తామంటూ వైసీపీ నేతల తరపున పోలీసు అధికారులే బెదిరింపులకు పాల్పడడంపై టీడీపీ నేతలు ఆందోళనలకు దిగారు. కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల గ్రామంలో పోలింగ్ కేంద్రం నుంచి టీడీపీ ఏజెంట్‌ను గెంటివేశారు.

    అనంతపురం జిల్లాలోని ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేన నేత మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసీపీ వర్గీయులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయని ఇప్పటికే జనసేన నేత పోలిసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఎన్నికలు ప్రారంభమైనప్పట్నుంచి ఏపీలో పలు చోట్ల వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయంటూ విపక్షాలు ఆరోపిస్తున్నారు.

    కర్నూలు జిల్లా పత్తికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు లేక పోలింగ్ చాలా ఆలస్యంగా  ప్రారంభమైంది.  అక్కడ ఏజెంట్లు లేకపోవడంతో పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చిన ఓటర్లు వెనుదిరుగుతున్నారు. జిల్లాలో మిగతా చోట్ల ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పత్తికొండలో 8:35 అయినా ఏజెంట్లు రాకపోవడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

    గుంటూరు జిల్లా ఈపూరు మండలం గోపువారిపాలెంలో వైసీపీ నేతుల దౌర్జన్యానికి దిగారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రానివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆందోళనకు దిగారు. తమ ఏజెంట్ల నుంచి ఫారాలు చించేసి బయటకు నెట్టేశారంటూ పోలింగ్ బూత్ దగ్గరే టీడీపీ నేతలు బైఠాయించారు.

    కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బేతంపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి రాకుండా వైసీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. టీడీపీ ఎన్నికలు బహిష్కరించింది కదా.. అలాంటప్పుడు పోలింగ్ కేంద్రంలోకి టీడీపీ ఏజెంట్లు ఎలా వస్తారు..? అని వైసీపీ ఏజెంట్లు గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయులను నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతోంది. ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లాలో మొత్తం 1763 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఐదు వేల మంది పోలీసులతో అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

    గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంలో వివాదం చోటు చేసుకోగా అది తీవ్ర ఘర్షణకు దారితీసింది.

    కడపలోనూ అదే పరిస్థితి కనిపించింది. అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. చాపాడు మండలం రాజువారిపేటలో టీడీపీ మద్దతుదారు ఏజెంట్‌ను కూర్చోకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయని ఆరోపిస్తున్నారు. దీంతో టీడీపీ మద్దతుదారు ఎంపీటీసీ అభ్యర్ధి రాజేశ్వరి పోలింగ్ బూతు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published: