• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP MPTC ZPTC ELECTIONS COMPLETED CANDIDATES WAITING FOR RESULT ON HIGH COURT NGS

ap mptc zptc electtins: తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన పరిషత్ ఎన్నికలు. ఫలితాలు ఎప్పుడో తెలుసా?

ap mptc zptc electtins: తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన పరిషత్ ఎన్నికలు. ఫలితాలు ఎప్పుడో తెలుసా?

తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసిన పరిషత్ పోలింగ్

ఏపీలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య పరిషత్ పోలింగ్ ముగిసింది. ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన పరిషత్ పోలింగ్ ముగిసింది. కానీ ఫలితాల కోసం మళ్లీ ఎదురు చూపులు తప్పవు. సింగిల్ బెంచ్ తీర్పు వచ్చేంత వరకు ఫలితాలు వెల్లడించే అవకాశం లేదు.

  • Share this:
    ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేపిన పరిషత్ ఎన్నికలు ముగిశాయి. అయితే మొన్నటి పంచాయతి, మున్సిపల్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఉదయం నుంచి ఘర్షణ వాతావరణం కనిపించింది. శ్రీకాకుళం నుంచి కడప జిల్లా వరకు అన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. కొన్ని చోట్ల అభ్యర్థుల గుర్తులు గల్లంతయ్యాయి. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు. బీజేపీ ఏజెంట్ అయితే బ్యాలెట్ బాక్సును నీటిలో వేశాడు. ఏజెంట్లు లేక కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల అధికార పార్టీ అభ్యర్థుల వర్గీయులు రెచ్చిపోయారు. ప్రత్యర్థులపై దాడులు చేశారు. ఇలాంటి ఘటనలు మినహా పోలింగ్ ముగిసింది. మొత్తం 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 4 గంటల వరకు 57.42 శాతం పోలింగ్‌ నమోదైంది.

    చాలా చోట్ల వైసీపీ-టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ దగ్గరే బాహాబాహీకి దిగారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలు రిగ్గింగుకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందనలో బ్యాలెట్ పేపర్లపై ముందుగానే ఫ్యాన్ గుర్తుపై ఓటు ముద్ర కనిపించడం కలకలం రేపింది. బ్యాలెట్ పేపర్ల బండిల్ మొత్తం ఫ్యాన్ గుర్తుపై ముద్ర ఉండటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడే నిరసన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాటతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ సిబ్బంది అధికార పార్టీకి సహకరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించగా మౌనంగా ఉండిపోయారు. ఈ వ్యవహారంపై స్థానిక వైసీపీ నేతలు స్పందించాల్సి ఉంది.

    చివరి నిమిషం వరకు అసలు ఎన్నికలు ఉంటాయో ఉండవో తెలియక తీవ్ర ఉత్కంఠ రేపాయి ఈ ఎన్నికలు. చివరికి హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో పోలింగ్ అయితే ముగిసింది. కానీ ఎస్‌ఈసీ ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈనెల 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. అయితే ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు ఇప్పటికే ఎస్‌ఈసీని ఆదేశించింది. సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యం పరిష్కారం అయ్యేంత వరకు ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన చేయవద్దని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. సింగిల్‌ జడ్జి తదుపరి ఉత్తర్వుల మేరకు ఓట్ల లెక్కింపుపై స్పష్టత వస్తుంది.
    Published by:Nagesh Paina
    First published: