ఆ ముగ్గురి వల్ల జగన్‌కు కొత్త తలనొప్పి తప్పదా?

AP MLC Schedule | ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి.

news18-telugu
Updated: August 3, 2019, 6:34 PM IST
ఆ ముగ్గురి వల్ల జగన్‌కు కొత్త తలనొప్పి తప్పదా?
ఇజ్రాయెల్ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా ఏపీలో మూడు ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే. అయితే అభ్యర్ధులను ఎంపిక చేయడం జగన్‌కు కత్తిమీదసామేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం ఈనెల 7న నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఏపీలో కరణం బలరాం, ఆళ్ల నాని , కోలగట్ల వీరభద్ర స్వామి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయగా.. తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా ఏపీలో మూడు ఎమ్మెల్సీలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే. అయితే ఇక్కడే ఆ పార్టీ అధినేత జగన్‌కు చిక్కొచ్చిపడింది. పార్టీలో ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దొరకని వారు, టికెట్ దొరికినా ఓడిపోయిన నేతలు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరి నిమిషంలో వైసీపీలో చేరారు. దీంతో ఆమెకు టికెట్ కేటాయించలేదు. నామినేటేడ్ పోస్టులకు సైతం లిస్ట్ భారీగా ఉండటంతో.. కృపారాణి ఎమ్మెల్సీ పదవిపై ఆశపెట్టుకున్నారు. ఇక మరో నేత అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలిచిన పండుల.. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అనివార్య కారణాల వల్ల జగన్.. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయారు. దీంతో ఈసారి ముఖ్యమంత్రి తనపై కరుణ చూపుతారని రవీంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు.

సినీనటుడు అలీకి సైతం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు మంత్రి కావాలన్నది తన కల అని అప్పట్లో అలీ చెప్పడం సంచలనం సృష్టించింది. అయితే, అలీని ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరోవైపు అలీతో పాటు సినీరంగానికి చెందిన మోహన్ బాబు, జయసుధ వంటి వారి పేర్లు సైతం ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తున్నాయి.

ఇక అన్నింటికి మించి రాయలసీమ జిల్లాల నుంచి మండలిలో బెర్త్ కోసం జగన్‌కు ఇబ్బందులు వచ్చే అవకాశం వుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన సీనియర్ నేతలు డీఎల్ రవీంద్రా రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డితో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇతర నేతలు సైతం ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీపడుతున్నారు. దీంతో అభ్యర్ధులను ఎంపిక చేయడం జగన్‌కు కత్తిమీదసామేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

First published: August 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు