ఏపీలో ఉప ఎన్నిక... షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ...

ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.

news18-telugu
Updated: July 30, 2020, 7:32 PM IST
ఏపీలో ఉప ఎన్నిక... షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ...
ఏపీ అసెంబ్లీ భవనం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ మోపిదేవి వెంకటరమణ ఈనెల 1న రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఈసీ షెడ్యూల్ జారీ చేసింది. మోపిదేవితో పాటు రాజీనామా చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీకాలం కేవలం 8 నెలలే ఉంది. దీంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఆగస్ట్ 6న నోటిఫికేషన్ జారీ అవుతుంది. 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 14వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. ఆగస్ట్ 17వ తేదీ లోపు నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు అయితే, ఆగస్ట్ 24న సోమవారం రోజు ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరుపుతారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అభ్యర్థి 2023 మార్చి 29 వరకు పదవిలో ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తన ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 30, 2020, 7:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading