• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP MINSTER DHARMANA KRISHNA DHAS ON TDP NO CANDIDATES FOR MUNICIPAL ELECTIONS NGS

Municipal elecections: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులే దొరకడం లేదా?

Municipal elecections: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులే దొరకడం లేదా?

ఏపీలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార విపక్షాలు మున్సిపల్ ఎన్నికల కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. బెదిరింపులతో వైసీపీ ఏకగ్రీవాలకు ప్రయత్నం చేస్తోందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తొంది. అయితే టీడీపీకి అసలు పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని వైసీపీ కౌంటరిస్తోంది.

ఏపీలో మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార విపక్షాలు మున్సిపల్ ఎన్నికల కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. బెదిరింపులతో వైసీపీ ఏకగ్రీవాలకు ప్రయత్నం చేస్తోందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తొంది. అయితే టీడీపీకి అసలు పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని వైసీపీ కౌంటరిస్తోంది.

  • Share this:
    ఏపీ మున్సిపల్ ఎన్నికలు సాధరణ ఎన్నికలను తలపిస్తున్నాయి.. రాష్ట్రంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు శ్రీరామ రక్ష అంటోంది అధికార పార్టీ.. వైసీపీ పాలనలో అరచకాలు.. ప్రభుత్వంపై వ్యతిరేకతా తమకు కలిసి వస్తాయి అంటోంది ప్రతిపక్షం. ఇలా రాజకీయ విమర్శలకు పరిస్థితిలు పరిమితం అవ్వడం లేదు. కొన్ని చోట్ల ఘర్షణలు సర్వసాధరణమయ్యాయి. ముఖ్యంగా ఎప్పుడూ లేనంతంగా బెదిరింపులు జరుగుతున్నాయని వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్ని చోట్లా నామినేషన్ వేసే పరిస్థితి లేకుండా ప్రత్యర్థులు అడ్డుపడుతున్నారనే ఆరపోణలు ఉన్నాయి.

    ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నా మున్సిపల్ ఎన్నికలను స్వీప్ చేస్తామంటోంది వైసీపీ. గత 20 నెలల్లో ముఖ్య మంత్రి జగన్ చేపడుతున్న పథకాలే పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారుల విజయానికి కారణమయ్యాయి అన్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. ఇక మున్సి పోల్స్ లోనూ పంచాయతీలకు మించిన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ప్రజలకు సీఎం జగన్ మీద ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తాయన్నారు మంత్రి. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో జగన్ చేసి చూపిస్తున్నారని గుర్తు చేశారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీకి చాలా మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవ చేశారు. టీడీపీ హయాంలో ప్రజాసంక్షేమం అటకెక్కిందని అందుకే ప్రజలు ఆ పార్టీని ప్రజలు మరిచిపోయారన్నారు. చంద్రబాబును పార్టీ కార్యకర్తలే నమ్మే పరిస్థితి లేదంటున్నారు.

    తిరుపతి విమానాశ్రయం లో చంద్రబాబు నిరసన డ్రామాని చూసి ప్రజలు నవ్వుకున్నారని సెటైర్ల వేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు వేసినా మసి పూసి మారేడు కాయ చేయలేరన్నారు. జగన్ మంత్రి వర్గంలో పనిచేయడం తనకు గొప్ప వరమన్నారు. రెవెన్యూ మంత్రిగా అర్హులకు ఇండ్ల పట్టాలు, అలాగే శాశ్వత భూ హక్కు పథకం అమలు చేయడం తన పూర్వ జన్మ సుకృతం అయ్యిందన్నారు ధర్మాన. అమరావతి రైతుల దీక్షలు చంద్రబాబు పుణ్యమే అని.. అయితే రైతులను తమ ప్రభుత్వం గౌరవిస్తుంది అన్నారు. వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి.

    తమ మద్దతు దారులకు ఓటు వేయలేదనే కారణంతో రేషన్ కార్డులు, పెన్షన్లు నిలిపివేశామని విపక్షాలు చేస్తున్న ప్రచారం నిజం లేదన్నారు మంత్రి. ఎవరైనా అర్హులు అయితే చాలు పార్టీతో సంబంధం లేకుండా అన్ని సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. అలాంటి సంఘటన ఎక్కడ కనిపించినా మాకు నిర్భయంగా చెప్పవచ్చన్నారు మంత్రి.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు