AP MINSTER BUGGANA FIRE ON TDP LEADERS WHEN HE MEET AFTER CENTRAL FINANCE MINSTER NIRMALA SITA RAMAN NGS
Minister Buggana: ఆ నేతల తీరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం.. ఆర్థిక మంత్రి బుగ్గన సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేతల తీరుతో రాష్ట్రానికి నష్టం
Buggana Comments: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు చేయడం తప్పడంలేదని మరోసారి స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి బుగ్గన.. మరోవైపు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో నేతల తీరుపై మండిపడ్డారు.
Minster Buggana Hot Comments: ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కరోనా వైరస్ (Corona Virus) భూతం, లాక్ డౌన్ (Lockdown) కారణంగా ఆదాయం పడిపోయింది. కేంద్రం నిధులు రాల్చడం లేదు.. బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. ఆదాయం లేకపోయినా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో.. అప్పులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రెండుమూడేళ్లలో మొత్తం రాష్ట్రం పూర్తిగా ఊబిలో కూరుకుపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Governmnent) మాత్రం ప్రమాదం లేదని.. అవసరాల కోసమే అప్పులు చేస్తున్నామంటోంది. మరోవైపు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitaraman)తో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath)భేటీ అయ్యారు. ఈ సందర్భం గా మంత్రి బుగ్గన ఏపీకి రావాల్సిన నిధులు, కేటాయింపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు. అన్ రాక్ కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న ఆర్బిట్రేషన్ కేసుపై చర్చించినట్లు బుగ్గన చెప్పారు. ఆ సంస్థకు అవసరమైన బాక్సైట్ సరఫరా చేసేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక ఈ కేసు న్యాయపరంగా పరిష్కారమైతే ఒక పెద్ద కంపెనీ రాష్ట్రానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థల ఏర్పాటు గురించి కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఇప్పటికే వీటిని నెలకొల్పేందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. విద్యా సంస్థలు, నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలైనన్ని ఉండాలన్నది సీఎం జగన్ ఉద్దేశమని బుగ్గన తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర్రానికి ఇప్పుడు నష్టం జరుగుతోంది అంటే అందుకు టీడీపీ నేతలే కారణమన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అప్పుల పాలై పోయిందంటూ.. టీడీపీ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో పేదలను కాపాడడం కోసం అప్పులు తీసుకొచ్చామని.. కానీ టీడీపీ మాత్రం తన రాజకీయ లబ్ధికోసమే చూస్తుంది తప్ప.. ప్రజల కోసం ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పాలన సమయంలో కరోనా లేదని.. అయినప్పటికీ వారు అప్పులు చేశారని.. అయితే ఇప్పుడు కరోనా వచ్చి.. ఆదాయం పడిపోయింది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి అప్పుల చేయడం తప్పడం లేదని బుగ్గన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వసనీయతను దెబ్బతీసేలా టిడిపి ప్రవర్తిస్తోందని.. టిడిపి నేతల ప్రవర్తన కారణంగా మొత్తం రాష్ట్రానికే నష్టం కలుగుతోందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం పాడైపోయిన పర్వాలేదనే తరహాలో టీడీపీ ఆలోచిస్తోందని ఆయన మండిపడ్డారు. టీడీపీ దుర్మార్గానికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వసనీయతను దెబ్బతీసేలా టీడీపీ ప్రవర్తిస్తోందని, ఆ పార్టీ ప్రవర్తన కారణంగా మొత్తం రాష్ట్రానికే నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత కొంత కాలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థిపై అధికార వైసీపీ, ప్రతిపిక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 41వేల కోట్ల రూపాలయల మేర అవకతవకలు జరిగినట్లు టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై టీడీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని బుగ్గన అన్నారు. అప్పటి నుంచి రెండు పార్టీల నేతల మధ్య తూటాలు పేలుతునే ఉన్నాయి. తాజా బుగ్గన వ్యాఖ్యలపైనా.. టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అసలు కరోన కోసం ప్రభుత్వం ఎంత ఖర్చ చేసిందో.. ప్రజలకు ఎంత ఇచ్చింది.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో లెక్క చెప్పాలని.. దమ్ముంటే స్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు నెటిజన్లు కూడా బుగ్గన కామెంట్లపై సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అప్పులు చేస్తోందని పదే పదే మండిపడ్డ బుగ్గన.. ఇప్పుడు కరోనా పేరు చెప్పి అదే పని చేయడం లేదా అని నిలదీస్తున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.