AP MINSTER ALLA NANI VOTE MISSING IN POLLING STATION IN WEST GODAVARI DISTRICT GNT NGS
AP Municiapl Elections: మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి ఆళ్ళనానికి చేదు అనుభవం : ఓటు వేయకుండానే వెనుతిరిగిన మంత్రి
ఏపీ మంత్రి ఆళ్ల నాని
పోలీంగ్ కేంద్రాల్లో విపక్ష నేతలకు, సాధరణ ఓటర్లకు చాలాసార్లు చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. కానీ ఏలూరులో మాత్రం స్వయంగా మంత్రికే చేదు అనునభవం ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
ఆయన ఒక మంత్రి.. నియోజకవర్గాన్ని శాసించే స్థాయి అయనది.. తన నియోజకవర్గంలో ఆయన ఏం చెబితే అదే జరుగుతుంది. కను సైగతో అన్ని పనులు చేయించగలరు. ఆయనే మంత్రి ఆళ్లనాని.. అలాంటి మంత్రికి ఊహించని షాక్ తగిలింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆయన పోలింగ్ కేంద్రం నుంచి వెనుతిరగాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా...
ఎన్నికలు ఏవైనా సాధారణంగా చాలా చోట్ల ఓట్ల గల్లంతు అనే మాట తరచూ వింటూ ఉంటాం. ఓటర్ కార్డు ఉంటుంది.. ఓటర్ల జాబితాలో పేరు ఉంటుంది. కానీ తీరా పోలింగ్ కేంద్రం దగ్గరకు వెళ్లేసరికి అక్కడి జాబితాలో పేరు ఉండదు. ఇలాంటి సంఘటనలు ప్రతి ఎన్నికల్లో చాలాసార్లు చూస్తూనే ఉంటాం.. అయితే ఇలాంటి షాక్ లు కేవలం సాధరణ ప్రజలకు మాత్రమే ఎదురవుతూ ఉంటాయి. చాలాసార్లు పోలింగ్ కేంద్రాల దగ్గర ఆందోళనలకు దిగిన సందర్భాలు కూడా చూశాం. మరోవైపు ప్రతి ఎన్నికల్లో విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు సైతం ఇలా ఆందోళనలు చేస్తూనే ఉంటారు. తమకు ఓటు వేశారి ఓట్లను కావాలనే అధికార పార్టీ నేతలు తొలగించారని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అనుభవం స్వయంగా మంత్రికే ఎదురవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో మంత్రి ఆళ్ళనానికి చేదు అనుభవం ఎదురైంది.
ఓటు వేసేందుకు ఆయన శనివారపు పేట పోలింగ్ బూత్ కి వెళ్లారు. తీరా అక్కడ ఓటు వేద్దామని జాబితాలో తన పేరు చూసుకుంటే లేదు. దీంతో మంత్రి నానికి ఓటు లేకపోవడంతో వెనుతిరగాల్సి వచ్చింది. మంత్రి అయిన తన ఓటే లేకుంటే ఎలా అని ఆయన సీరియస్ అయ్యారు. పోలింగ్ అధికారుల తీరుపై మంత్రి నాని మండిపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి విపక్షాలు ఇదే విషయంపై మండిపడుతున్నాయి.
ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా జరగలేదని ప్రతిపక్షాలు ఆందోళనలు కూడా చేశాయి. అప్పుడు మంత్రి అలాంటిది ఏం లేదని విపక్షాల వాదనను కొట్టి పడేశారు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయని కితాబు ఇచ్చారు. కానీ ఇప్పుడు స్వయంగా మంత్రికే ఇలాంటి అనుభవం ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు సైతం సెటైర్లు వేస్తున్నారు.
తాజాగా ఇదే అంశంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. డివిజన్లను రీ-డ్రాయింగ్ చేయడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విమర్శించారు. ఒకే ఇంటిలో ఉన్న వారి ఓట్లను వేర్వేరు పోలింగ్ స్టేషన్లల్లో వేశారని.. తన ఇంట్లో నా ఓటు ఒక చోట, అమ్మ ఓటు వేరే చోట ఉంటే ఎలా అని ప్రశ్నించారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.