ఆ పని మనం చేయగలమా? సీఎం జగన్ దూకుడుకు మంత్రులు షాక్

సీఎం జగన్‌ ఇలా చెప్పడంతో కల్పించుకున్న ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కష్టం సార్..! అంటూ నమస్కారం పెట్టేశారు. దీనిపై ఏమౌతుందన్న ? అంటూ జగన్ ఎల్వీని ప్రశ్నించారు.

news18-telugu
Updated: June 25, 2019, 7:25 AM IST
ఆ పని మనం చేయగలమా? సీఎం జగన్ దూకుడుకు మంత్రులు షాక్
కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి
news18-telugu
Updated: June 25, 2019, 7:25 AM IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ఏపీ రాజకీయ నేతలతో పాటు... సొంతపార్టీకి చెందిన నేతలు, మంత్రులు షాక్ తింటున్నారు. ఇక అధికారులైతే నీళ్లు నములుతున్నారు. తాజాగా సోమవారం కలెక్టర్ల సదస్సు వేదికగా సీఎం వైఎస్ జగన్ చేసిన పలు కీలక వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది. ఏపీలో విద్యా వ్యవస్థపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్...కలెక్టర్ సదస్సులో కూడా అధికారులకు దీనిపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్లలో స్కూళ్లలో అభివృద్ధి సాధించి మెరుగుపడాలన్నారు.

ఈ సందర్బంగా సీఎం జగన్‌కు అధికారులు....పాఠశాలల్లో టాయిలెట్స్ శుభ్రం చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నాయని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల స్కూళ్ల హెడ్మాస్టార్లు స్కూళ్లల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాల్సి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ...స్కూళ్లల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు జీతం ఎంతిస్తున్నారని ఆరా తీశారు. ఏదో నామ్‌కే వాస్తే అన్నట్లుగా ఇస్తుండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇకపై స్కూళ్లల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు రూ. 18వేల మేర వేతనం ఇవ్వాలన్న సీఎం జగన్ అన్నారు.

సీఎం జగన్‌ ఇలా చెప్పడంతో కల్పించుకున్న ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

కష్టం సార్..! అంటూ నమస్కారం పెట్టేశారు. దీనిపై ఏమౌతుందన్న ? అంటూ జగన్ ఎల్వీని ప్రశ్నించారు. ఆ పని వేరే వారు చేయలేరని చెప్పుకొచ్చారు జగన్.పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని ఎన్ని లక్షలిచ్చినా మనం చేయగలమా..? అని సీఎం జగన్ అనడంతో అధికారులంతా అవాక్కయ్యారు. దీంతో పారిశుధ్య కార్మికుల వేతనాలపై  అవకాశాలు పరిశీలించి నిర్ణయం తీసుకుందామని ఆర్దిక మంత్రి బుగ్గన తెలిపారు. మొత్తం మీద జగన్ ధనాధన్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలతో... మంత్రులు షాక్ అవుతుంటే.. అధికారులు మాత్రం ఎలారా ? దేవుడా అంటూ తలలు పట్టుకుంటున్నారు.

First published: June 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...