‘మంగళగిరిలో పవన్ కళ్యాణ్ షూటింగ్’

మందడంలో పవన్ కళ్యాణ్ (File)

ఐదేళ్లు రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని పవన్ కళ్యాణ్... ఇప్పుడు ఎందుకు తమపై విమర్శలు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు.

  • Share this:
    అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా సింగపూర్ లో షూటింగ్ చేశాడని..ఇప్పుడు మంగళగిరిలో షూటింగ్ చేస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్లు రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని పవన్ కళ్యాణ్... ఇప్పుడు ఎందుకు తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమరావతి తరలిస్తున్నారని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే తమ సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని ఆయన స్పష్టం చేశారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఎక్కడా అన్యాయం జరగదని ఆయన వ్యాఖ్యానించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: