పవన్ కళ్యాణ్.. కామెడీ కాకపోతే ఏంటిది?... ఏపీ మంత్రి సెటైర్లు...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: May 21, 2020, 3:34 PM IST
పవన్ కళ్యాణ్.. కామెడీ కాకపోతే ఏంటిది?... ఏపీ మంత్రి సెటైర్లు...
పవన్ కళ్యాణ్ Photo : Twitter
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఆల్రెడీ సాయం ప్రకటించిన తర్వాత కొత్తగా డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పురోహితులకు ప్రభుత్వం సాయం చేయాలని ఏపీ సర్కారును పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి స్పందించారు. ‘పవన్ కళ్యాణ్ అయిపోయిన పెట్టికి బాజాలు కొట్టొద్దు. లక్షల పుస్తకాలు చదివి ఉన్నమతి పోయిందా?. పురోహితుల పై పవన్ కళ్యాణ్ కపట ప్రేమ చూపుతున్నారు. ఎవరు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా దేవాలయాలలో పనిచేసే పురోహితులకు వన్ టైమ్ కింద రూ.5000 ఇచ్చారు. సంక్షేమ పథకాలకు క్యాలెండర్ ను సీఎం జగన్ 19వ తేదీన రిలీజ్ చేశారు. అందులో మే నెల 26న అర్చకులకు, రూ.5000 చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కానీ, 20వ తేదీ పవన్ కళ్యాణ్ పురోహితులకు సాయం చేయాలని పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. పార్ట్ టైం రాజకీయాలు చేసే ప్యాకేజీ పవన్ కళ్యాణ్ నిద్ర లేచిన తర్వాత నిజాలు తెలుసుకొని మాట్లాడటం మంచిది.’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తే నిజాలు కనబడతాయన్నారు. హైదరాబాదులో కూర్చున్న పవన్ కళ్యాణ్ కళ్ళు సంక్షేమ పథకాల పంపిణీ కనబడటం లేదేమో అని విమర్శలు గుప్పించారు.
First published: May 21, 2020, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading