జగన్ బాహుబలి... వారంతా కాలకేయులు... ఏపీ మంత్రి కామెంట్స్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అచ్చెన్నను హత్య చేయాలని ప్రభుత్వం చూస్తుందంటూ అర్థంలేని కామెంట్లు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు.

  • Share this:
    ప్రజా సమస్యలు పరిష్కరించే సీఎం జగనే బాహుబలి అని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మిగిలిన వాళ్లు కాలకేయులు లాంటివాళ్లు అని ఆయన విమర్శించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను ఆగస్టు15న నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. భార్యకు భర్త మెసేజ్ పెట్టాలన్నా జగన్ పర్మిషన్ తీసుకోవాలా ? అనిప్రశ్నిస్తున్న లోకేశ్ కామెంట్స్‌కు అర్థముందా ? అని వెల్లంపల్లి విమర్శించారు. సీఎం జగన్ దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పడిపోయిందన్న మంత్రి వెల్లంపల్లి... లోకేశ్‌ను టీడీపీ నేతలు పరామర్శించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు.

    అచ్చెన్నను హత్య చేయాలని ప్రభుత్వం చూస్తుందంటూ అర్థంలేని కామెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. హత్యలు చేసే సంస్కృతి టీడీపీదే అని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. వంగవీటి రంగాను నడిరోడ్డుపై చంపింది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలోనే వంగవీటి రంగాను హత్య చేయించలేదా ? అని ప్రశ్నించారు. టీడీపీ నేతల చేస్తున్న విమర్శలకు అర్థం లేదని... వారిని ప్రజలు పట్టించుకోవడం లేదని మంత్రి వెల్లంపల్లి అన్నారు.
    First published: