ఆ పత్రిక విషం చిమ్ముతోంది... మండిపడ్డ ఏపీ మంత్రి
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందించి మత మార్పిడీ చేయాలని చూస్తున్నారని విశ్లేషించడాన్ని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తప్పుబట్టారు.
news18-telugu
Updated: November 18, 2019, 4:25 PM IST

మంత్రి ఆదిమూలపు సురేశ్(
- News18 Telugu
- Last Updated: November 18, 2019, 4:25 PM IST
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే తమ నిర్ణయంపై కొన్ని పత్రికలు విషం చిమ్ముతున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తీవ్రంగా మండిపడ్డారు. చివరికి ఇంగ్లీష్ మాధ్యమాన్ని మతానికి ముడిపెట్టి విశ్లేషణ చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందించి మత మార్పిడీ చేయాలని చూస్తున్నారని విశ్లేషించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇంతకన్నా దుర్మర్గమైన రాతలు ఎక్కడైనా వుంటాయా ? అని ఏపీ మంత్రి ప్రశ్నించారు. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు.
చైనా, జపాన్ దేశాలకు చెందిన వారు కూడా ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికా, యూరోప్ దేశాల్లో అవకాశాలను పొందుతున్నారని... దీనిని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లీష్ మీడియంపై నిర్ణయం తీసుకున్నారని ఏపీ మంత్రి అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నామని అన్నారు. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఎందుకు అవసరమో ఇప్పటికే సీఎం జగన్ స్పష్టంగా వివరించారు. దీనిని వక్రీకరిస్తూ కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది.

వైఎస్ జగన్‌కు ఝలక్ ఇచ్చిన జీవితా రాజశేఖర్ దంపతులు..
మంత్రి పదవిపై ఓపెన్ అయిపోయిన రోజా...సీఎం జగన్‌కు మదిలో మాట చెప్పేసిందిగా...
జగన్‌కు కౌంటర్ ఇవ్వాలంటే బాలయ్యే కరెక్ట్... బీజేపీ నేత
జగన్ కేబినెట్లో ఆ ఇద్దరే బెస్ట్ మినిస్టర్లు?
కడప స్టీల్ ప్లాంట్‌కు కొత్త పేరు పెట్టిన ఏపీ ప్రభుత్వం...
ఏపీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు... బీటెక్‌లోనూ మార్పులు