నా శాఖపై సమీక్ష పెడతా... ఎవరు అడ్డొస్తారో చూస్తా? ఈసీ,వైసీపీకి మంత్రి సవాల్

లంగాణలో విద్యార్థులు చనిపోతుంటే ... ఈసీ బాధ్యత వహిస్తుందా? లేక ప్రభుత్వమా అంటూ సోమిరెడ్డి నిలదీశారు.

news18-telugu
Updated: April 23, 2019, 4:34 PM IST
నా శాఖపై సమీక్ష పెడతా... ఎవరు అడ్డొస్తారో చూస్తా? ఈసీ,వైసీపీకి మంత్రి సవాల్
మాజీ మంత్రి సోమిరెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎన్నికల ఫలితాలకు నెల రోజులు ముందు నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం సమీక్షలు జరిపితే తప్పేంటి అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘానికి,వైసీపీకి ఆయన సవాల్ విసిరారు. వ్యవసాయ శాఖపై సమీక్ష జరుపుతామన్నారు. ఎవరు అడ్డొస్తారో చూస్తానన్నారు సోమిరెడ్డి. ఎవరైనా తన సమీక్షను అడ్డుకొంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. సీఎం మంత్రులు ఇంట్లో కూర్చోవాలా ? అంటూ ఆయన మండిపడ్డారు. పరిపాలించే హక్కు రాజ్యంగం మాకు కల్పించిందన్నారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతుంటే ... ఈసీ బాధ్యత వహిస్తుందా? లేక ప్రభుత్వమా అంటూ సోమిరెడ్డి నిలదీశారు. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ తెలియని ఆనం ఆర్థిక మంత్రిగా ఎలా పనిచేశారంటూ ఎద్దేవా చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలతో.. ప్రభుత్వ సదుపాయం అయిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారన్నది విజయసాయి అభ్యంతరమట. అందుకే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే.. చంద్రబాబు దానిని ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
First published: April 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading