ఇంగ్లీష్ రాక ఇప్పటికీ బాధపడుతుంటా.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంటర్‌లో ఇంగ్లీషు మీడియంలో చేరానని శ్రీవాణి చెప్పారు. అయితే ముందు నుంచి ఇంగ్లీష్‌లో చదవకపోవడం వల్ల.. మూడు నెలలకే మళ్లీ తెలుగు మీడియంలో చేరి ఇంటర్‌ పూర్తిచేసినట్టు తెలిపారు.

news18-telugu
Updated: November 15, 2019, 2:33 PM IST
ఇంగ్లీష్ రాక ఇప్పటికీ బాధపడుతుంటా.. ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
పాముల పుష్పశ్రీవాణి (File Photo)
  • Share this:
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీలో తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పేద,మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంగ్లీష్ మీడియం బోధన తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతుండగా..ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మాతృభాషను లేకుండా చేయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పాముల పుష్ప శ్రీవాణి దీనిపై స్పందించారు. ఇంగ్లీష్ రాకపోతే కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయడానికి తానే ఒక ఉదాహరణ అని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలోని బుట్టాయగూడెంలో నాడు-నేడు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు.

తాను 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివానని.. ఇంటర్‌లో ఇంగ్లీషు మీడియంలో చేరానని శ్రీవాణి చెప్పారు. అయితే ముందు నుంచి ఇంగ్లీష్‌లో
చదవకపోవడం వల్ల.. మూడు నెలలకే మళ్లీ తెలుగు మీడియంలో చేరి ఇంటర్‌ పూర్తిచేసినట్టు తెలిపారు. డిగ్రీలో మళ్లీ ఇంగ్లీష్ మీడియంలో చేరినప్పటికీ.. ఇంగ్లీష్ భాషపై అంతగా పట్టు సంపాదించలేకపోయానని అన్నారు. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఇప్పటికీ ఎంతగానో బాధపడుతుంటానని చెప్పారు. నేటి తరం పిల్లలకు అలాంటి పరిస్థితులు ఎదురుకావద్దనే సీఎం ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెడుతున్నారని చెప్పుకొచ్చారు.

First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com