నేను మంత్రిగారి భార్యను... టోల్ ఫీజు కట్టేదిలేదు....

news18-telugu
Updated: May 18, 2019, 8:49 AM IST
నేను మంత్రిగారి భార్యను... టోల్ ఫీజు కట్టేదిలేదు....
ప్రత్తిపాటి పుల్లారావు (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 18, 2019, 8:49 AM IST
గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద టోల్ ఫీజ్...విషయంలో ఓ మంత్రిగారి భార్య నానా హంగామా చేశారు. ఫీజు విషయంలో టోల్ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు. మంత్రి గారి భార్య అంటే డబ్బుకు ఏం కొదవలే అనుకుంటాం. కానీ ఆవిడగారు మాత్రం .... టోల్ పీజు కట్టడానికి కిందమీద పడింది. ఆవిడ ఇంకెవరో కాదు.. ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకట కుమారి. వెంకటకుమారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ దారిలో నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలోని టోల్‌గేటు వద్దకు చేరుకున్నారు. సాధారణంగా టోల్‌ గేటు వద్ద మంత్రులు, ఆపై స్థాయి నాయకులకు ఉచితం ఉంటుంది. కానీ ఆ స్టిక్కర్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఫ్రీ ఉండదు. స్టిక్కర్ ఉన్నా కొన్ని సార్లు మాత్రం ఫీజు కట్టాల్సిందే. కానీ మంత్రి గారి భార్య ఈ లాజిక్ మిస్ అయ్యారు. టోల్ గేటు ఫీజు కట్టేదిలేదని భీష్మించుకున్నారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది నిబంధనలు వివరించినా ఆమె పట్టించుకోలేదు.. నేను మంత్రి గారి భార్యను నన్నే టోల్ గేటు ఫీజు అడుగుతారా అంటూ వారితో గొడవపెట్టుకున్నారు.

కానీ ఆ టోల్ గేట్ సిబ్బంది కూడా ఊరుకోలేదు. ఫీజు కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే కారు కదిలేది లేదన్నారు. ఫీజు విషయంలో ఉచితం మంత్రిగారికే తప్ప.. ఆ కారు వేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉండదని తెగేసి చెప్పారు. ఫీజు కట్టాల్సిందేనంటూ కారును అడ్డుకున్నారు. దీంతో ఎంతసేపు గొడవపెట్టుకున్నా టోల్ సిబ్బంది వినకపోయేసరికి వారిపై చిర్రుబుర్రులాడుతూ ఫీజు కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు వెంకట కుమారి. ఇప్పుడు ఈ మంత్రిగారి ఫీజు వివాదం వైరల్ న్యూస్‌గా మారింది.

 

First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...