రాజకీయ పార్టీ అంటే రైల్వే బోగీ... ఏపీ డిప్యూటీ సీఎం చెప్పిన కథ...

పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఫైల్ ఫోటో)

వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీ అంటే రైల్వే జనరల్ బోగి లాంటిందని అన్నారు. అందులో న్యాయమూర్తి ఎక్కుతాడు.. ముద్దాయి ఎక్కుతాడన్నారు. వాళ్లు రైలు ఎక్కారని మనం దిగిపోతే.. నష్టపోయేది మనమేనని అన్నారు. మళ్లీ మన గమ్యస్థానం చేరాలంటే రైలు ఉండదని పిల్లి సుభాష్‌చంద్రబోస్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు, (పక్కన పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణు)


    ‘సింపుల్‌గా ఇక్కడ ఓ విషయం మీ అందరి ముందు ప్రస్తావిస్తున్నా. పొలిటికల్ పార్టీ అంటే రైల్వే జనరల్ బోగీ లాంటిది. టికెట్ ఉన్నవాడు ఎక్కుతాడు. టికెట్ లేనివాడు కూడా ఎక్కుతాడు. న్యాయమూర్తి ఎక్కుతాడు. ముద్దాయి ఎక్కుతాడు. దొంగ ఎక్కుతాడు. దొర ఎక్కుతాడు. సంపన్నుడు ఎక్కుతాడు. నిరుపేద ఎక్కుతాడు. వాళ్లు ట్రైన్ ఎక్కారు కాబట్టి నేను దిగిపోతున్నా అంటే నష్టపోయేది మనమే. ఎందుకంటే మళ్లీ మనకి ట్రైన్ ఉండదు గమ్యస్థానానికి వెళ్లడానికి. గతంలో ఎన్ని అభ్యంతరాలు ఉన్నా కూడా కలసి ప్రయాణం చేసేటప్పుడు కొంచెం దూరదృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలను ప్రత్యేకంగా కోరుతున్నా.’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.

    YSRCP leader Thota Vani likely to quit the party to join BJP
    వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తోట నరసింహం దంపతులు.. (File)


    తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు వర్గానికి చెందిన కొందరు కార్యకర్తలు వైసీపీలో చేరడానికి సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు వెళ్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు వర్గానికి చెందిన మేడిశెట్టి ఇజ్రాయిల్ అనుచరులు కాన్వాయ్‌ను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. తోట త్రిమూర్తులు, చెల్లుబోయిన వేణు వర్గాలకు మధ్య విబేధాలు ఉన్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వేదిక మీద తోట త్రిమూర్తులుతో పాటు మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా ఉన్నారు.

    ఏపీ డిప్యూటీ సీఎంకు ఆ పదవి... జగన్ నిర్ణయం ? | Cm ys jagan mohan reddy may give guda post to ap deputy cm pilli subhash Chandra bose ak
    జగన్‌తో పిల్లి సుభాష్ చంద్రబోస్(ఫైల్ ఫోటో)


    2019 అసెంబ్లీ ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టీడీపీ తరఫున రామచంద్రాపురం నుంచి పోటీ చేశారు. అయితే, తోట మీద వైసీపీ తరఫున పోటీ చేసిన చెల్లుబోయిన వేణు విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తోట త్రిమూర్తులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరుతున్న సమయంలోనే చెల్లుబోయిన వేణును కూడా పిలిచి జగన్ సర్దిచెప్పారు. దీంతో అప్పట్లో ఇద్దరూ కలసి ఫొటోలు కూడా దిగారు. అయితే, లోకల్ అయిన తోట త్రిమూర్తులు, నాన్ లోకల్ అయిన చెల్లుబోయిన వేణు మధ్య అంతర్గత యుద్ధం నడుస్తున్నట్టు తెలుస్తోంది.

    Political party Train compartment,pilli subhash chandrabose,pilli comments on politics,ap dy cm pilli,thota trimurthulu vs chelluboiana,రాజకీయ పార్టీ అంటే రైల్వే జనరల్ బోగీ,పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్స్,పిల్లి సుభాష్ చంద్రబోస్ వార్తలు,తోట త్రిమూర్తులు వర్సెస్ చెల్లుబోయిన
    పిల్లి సుభాష్ చంద్రబోస్


    పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏపీ శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇటీవల శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఒకవేళ మండలి రద్దు అయితే, ఆటోమేటిక్‌గా పిల్లి సుభాష్ చంద్రబోస్ కేబినెట్ పదవి కూడా పోతుంది. ఆరు నెలల్లోపు ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన జగన్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగవచ్చు. అయితే, పిల్లి సుభాష్ కోసం రాజీనామాచేసి సీటు ఇచ్చే నాయకుడు ఎక్కడ దొరుకుతారనేది సందేహం. మంత్రి పదవి పోతుందని తెలిసిన పిల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఆసక్తికరంగా మారింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: