ఇదేం పవనిజం... పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి సెటైర్లు

టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు నాటి ప్రతిపక్షం వైసీపీని ప్రశ్నించిన పవన్... ఇప్పుడు అధికారంలోకి ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు.

news18-telugu
Updated: October 25, 2019, 3:48 PM IST
ఇదేం పవనిజం... పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి సెటైర్లు
పవన్ కళ్యాణ్
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి పేర్ని నాని. పవనిజం అంటే జగన్‌ను విమర్శించడమేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వంత పాడటాన్ని ఎలా చూడాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు నాటి ప్రతిపక్షం వైసీపీని ప్రశ్నించిన పవన్... ఇప్పుడు అధికారంలోకి ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. టీడీపీతో లాలూచీ, జగన్‌తో పేచీ అంటేనే పవనిజంగా మారిందని అన్నారు. తనపై ఎలాంటి కేసుల్లేని పవన్ కళ్యాణ్ బిజెపిని ఇప్పటివరకు ప్రశ్నించారా.? అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్ పై కేసులు ఉన్నాయని చెబుతున్న పవన్ కళ్యాణ్... అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులని గుర్తించలేదా ? అన్నారు.

జనసేన పార్టీ సీట్ల పంపకం కూడా చంద్రబాబు నిర్దేశించిందే అని పేర్ని నాని అన్నారు. అమెరికాలో ఈ సీట్ల కేటాయింపులు చేసుకున్నారని తెలిపారు. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం ఒక్కటే పవన్ కళ్యాణ్‌కు తెలుసని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో తప్పు చేయనిది ఎప్పుడని పేర్ని నాని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ పేరు చెప్పడం బాబుకు అలవాటని అన్నారు. ఇప్పుడు బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు చూస్తున్నారని... అమిత్ షా పుట్టిన రోజున చంద్రబాబు లవ్ లెటర్స్ రాస్తున్నారని ఎద్దేవా చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: October 25, 2019, 3:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading