మీకు పెళ్లిళ్లంటే ఇష్టం పవన్ నాయుడు... ఏపీ మంత్రి విమర్శలు

పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు నడుచుకునే నాయకుడని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఏపీ సీఎం జగన్‌ను విమర్శించే పవన్ కళ్యాణ్‌కు... ఆయన చేపట్టిన మంచి పనులు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు.

news18-telugu
Updated: November 12, 2019, 6:31 PM IST
మీకు పెళ్లిళ్లంటే ఇష్టం పవన్ నాయుడు... ఏపీ మంత్రి విమర్శలు
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
రాజకీయం అంటే సినిమాలు కాదని ఏపీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్‌పై ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇసుక కొరతకు వరదలే కారణమనే విషయం పవన్ కళ్యాణ్‌కు తెలియకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పినట్టు నడుచుకునే నాయకుడని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఏపీ సీఎం జగన్‌ను విమర్శించే పవన్ కళ్యాణ్‌కు... ఆయన చేపట్టిన మంచి పనులు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడమేనా పవన్ కళ్యాణ్‌కు ఉన్న సంస్కారం ? అని మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వెంకయ్యనాయుడిని పవన్ కళ్యాణ్ విమర్శించినంతగా ఎవరూ విమర్శించలేదని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్‌కు కేవలం చంద్రబాబు మాటలు మాత్రమే వినిపిస్తాయని పేర్ని నాని ఎద్దేవా చేశారు. జగన్‌పై కేసులు ఎందుకు పుట్టుకొచ్చాయో పవన్ పక్కనే ఉన్న జేడీ లక్ష్మీనారాయణకు బాగా తెలుసని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు నరనరాన కుల భావన జీర్ణించుకుపోయిందని పేర్ని నాని మండిపడ్డారు.

Published by: Kishore Akkaladevi
First published: November 12, 2019, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading