హోమ్ /వార్తలు /politics /

AP Movie Tickets Issue: ప్రజల కోసమే ఈ నిర్ణయం.., సినిమా టికెట్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

AP Movie Tickets Issue: ప్రజల కోసమే ఈ నిర్ణయం.., సినిమా టికెట్లపై క్లారిటీ ఇచ్చిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొన్ని రోజులుగా సినిమా టికెట్ల అమ్మకంపై (Movie Tickets Sales) వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొన్ని రోజులుగా సినిమా టికెట్ల అమ్మకంపై (Movie Tickets Sales) వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొన్ని రోజులుగా సినిమా టికెట్ల అమ్మకంపై (Movie Tickets Sales) వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొన్ని రోజులుగా సినిమా టికెట్ల అమ్మకంపై (Movie Tickets Sales) వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వమే ఆన్ లైన్లో టికెట్లు విక్రయించాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ అంశంలో వస్తున్న విమర్శలకు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani) క్లారిటీ ఇచ్చారు. ఆన్ లైన్ విధానం ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖులే కోరారని ఆయన తెలిపారు. సినీ పెద్దలే సూచననే ప్రభుత్వం పరిశీలించిందన్నారు. సినిమా టికెట్ల విషయంలో పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందిని.. బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారాయన. టిక్కెట్ రేట్లను పెంచడం, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన జీవో ఇచ్చామని.. ప్రజలకు మేలు చేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు పేర్ని నాని.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే సినిమా టిక్కెట్ల విక్రయం జరిపేలా ఆదేశాలిచ్చామని పేర్ని నాని అన్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించిందన్నారు. దీనిపై అర్ధం లేని విధంగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారని.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేసే ప్రయత్నం చేయొద్దని మంత్రి ఎద్దేవా చేశారు.

ఇది చదవండి: సారీ చెప్పిన్న అచ్చెన్న.. కూన డుమ్మా.. నిమ్మగడ్డకు మరో ఛాన్స్.. అసెంబ్లీ చుట్టూ ఏపీ పాలిటిక్స్..!


2002లోనే ఆన్ లైన్ ద్వారా సినిమా టిక్కెట్లను విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్ని నాని తెలిపారు. పన్నుల ఎగవేత అరికట్టొచ్చని గతంలో ప్రభుత్వాలు భావించాయని.., ఆన్ లైన్లో సినిమా టిక్కెట్లను విక్రయించవచ్చని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి సమ్మతి తెలుపుతూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అంగీకారం తెలిపిందన్న మంత్రి... ఎవరికో మేలు చేయడానికి విమర్శలు చేయడం సరికాదన్నారు.


ఇది చదవండి: పెన్షన్ దారులకు అలర్ట్... వారం రోజులే డెడ్ లైన్.. లేదంటే పెన్షన్ కట్..

త్వరలోనే సినీనిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. సినిమా హాళ్ల యాజమాన్యాలతో త్వరలో సమావేశం జరపనున్నట్లు పేర్ని వెల్లడించారు. ఈ సమావేశాన్ని ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ నేతృతంలో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం ఏ మంచి చేస్తోన్నా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆన్ లైన్ విధానం మంచిదని సినీ ప్రముఖులు చాలా మంది చెబుతున్నారని వివరించారు.

ఇది చదవండి: శ్రీవారి భక్తులకు కొత్త చిక్కులు... వారి అత్యుత్సాహంతో దర్శనానికి దూరం..


సినీ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగనుతో భేటీ అవుతామని కోరారని.. ఆగస్టులో భేటీ కావాలని భావించినా కుదర్లేదన్నారు. త్వరలోనే సినీ పెద్దలు సీఎం వైఎస్ జగన్ తో భేటీ అవుతారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇక ఇటీవల ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టికెట్ల విక్రయాలను ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే..! దీనిపై అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించనింది. టికెట్ల విక్రయాలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

First published:

Tags: Andhra Pradesh, Ap minister perni nani, Tollywood

ఉత్తమ కథలు