హోమ్ /వార్తలు /politics /

ఏపీ ప్రభుత్వం బిచ్చమెత్తుకుంటోందన్న తెలంగాణ మంత్రి.. కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి.. కేసీఆర్ ఎందుకు ఢిల్లీ వెళుతున్నారంటూ..

ఏపీ ప్రభుత్వం బిచ్చమెత్తుకుంటోందన్న తెలంగాణ మంత్రి.. కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి.. కేసీఆర్ ఎందుకు ఢిల్లీ వెళుతున్నారంటూ..

ప్రశాంత్ రెడ్డి, పేర్ని నాని (ఫైల్ ఫోటో)

ప్రశాంత్ రెడ్డి, పేర్ని నాని (ఫైల్ ఫోటో)

కొంతకాలంగా తెలంగాణ ప్రగతి గురించి ప్రజలకు చెప్పేందుకే ఏపీ ప్రస్తావన తీసుకురావడం సాధారణమైపోయింది. తాజాగా తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనికి ఏపీ మంత్రి కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ధాన్యం కొనాలంటూ తెలంగాణలో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నిజామాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైతే.. మనం అడుక్కుతింటామని ఆంధ్రోళ్లు అన్నారని.. కానీ ఇప్పుడు వాళ్లే పదే పదే కేంద్రాన్ని అడుక్కుంటున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి డబ్బులు వస్తే తప్ప.. ఏపీ ప్రభుత్వానికి రోజు గడిచే అవకాశం లేదని వ్యాఖ్యానించారు.


కేంద్రం రైతుల బోర్లకు మీటర్లు పెట్టాలని చెబితే.. ఏపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. కానీ తాము మాత్రం అలా చేయడం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చేస్తున్నందుకు రైతులు బీజేపీ నేతల కింద మోటర్లు పెట్టాలని.. వారిని ఎక్కడికక్కడ ప్రశ్నించాలని కోరారు. అయితే ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. తాము తమకు రావాల్సిన నిధుల కోసం అడుక్కోవడానికి ఢిల్లీకి వెళుతున్నామని.. మరి కేసీఆర్ ఎందుకు ఢిల్లీ వెళుతున్నారని ప్రశ్నించారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్.. కథ మళ్లీ మొదటికొచ్చిందా ?

Harish Rao: హరీశ్ రావుకు మరో కీలక బాధ్యతలు.. కేసీఆర్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన..

కేంద్రంలో చేరతామని.. తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కేసీఆర్ ఢిల్లీ పెద్దలను కోరుతున్నట్టు విమర్శించారు. అయితే బయటకు వచ్చి మరో విధంగా మాట్లాడతారని మంత్రి పేర్ని నాని అన్నారు. బయట కాలర్ ఎగరేసి.. లోపల కాళ్లు పట్టుకునే తత్వం తమది కాదని అన్నారు. తాము స్నేహం చేసినా.. ఫైట్ చేసినా అంతా ఓపెన్‌గానే చేస్తామని పేర్ని నాని అన్నారు.

మరోవైపు వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ మహా ధర్నా చేపట్టింది. సిద్దిపేటలో జరిగిన ధర్నాలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోరాటం ఇప్పుడే మొదలైంది.. ఇది ఆరంభమే.. మున్ముందు మరింత ఉదృతం చేస్తామని ఒకింత కేంద్రాన్ని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అసమంజస విధానాలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. ఏడేళ్ల టీఆర్ఎస్ హయాంలోనే రైతులకు మేలు జరుగుతున్నదని.. నేడు కాళేశ్వరంతో ఏ ఊర్లో చూసిన చెరువులు అన్ని నిండు కుండల్లా కళకళలాడుతున్నాయని హరీష్ చెప్పుకొచ్చారు.

First published:

Tags: Andhra Pradesh, Ap minister perni nani, Minister prashanth reddy, Telangana

ఉత్తమ కథలు