AP MINISTER PERNI NANI COUNTER TO NARA LOKESH AND DEVINENI UMA ON BANDER MACHILIPATNAM AK
పండితపుత్ర లోకేశ్... ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్
సీఎం జగన్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలోనూ ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.
ఐదేళ్లుగా మచిలీపట్నంను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని ఏపీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు వేసిన శంకుస్థాపన రాయి తప్ప ఇక్కడ మరేమీ కనిపించదని అన్నారు.
బందర్ పోర్టును తెలంగాణకు ఇచ్చేస్తున్నామని టీడీపీ నేతలు అసత్యప్రచారాలు చేస్తున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రహస్య జీవోలు అంటూ జీవోలు డౌన్ లోడ్ చేయడం రాని లోకేశ్ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పండితపుత్ర లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని... ఎవరో రాసిచ్చినవి ట్విట్టర్లో పెట్టడం సరికాదని మంత్రి పేర్ని నాని సూచించారు. ఐదేళ్లుగా మచిలీపట్నంను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు వేసిన శంకుస్థాపన రాయి తప్ప ఇక్కడ మరేమీ కనిపించదని అన్నారు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదని మంత్రి పేర్ని నాని టీడీపీపై ధ్వజమెత్తారు.
బందర్ పోర్ట్ పనులు నవయుగ కంపెనీ చేయకపోతే తామే చేపడతామని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్ పబ్లిసిటీ కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వయసు పెరిగే కొద్దీ చంద్రబాబు ఆలోచన పరిజ్ఞానం మసకబారుతోందని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ గురించి మాట్లాడేడప్పుడు దేవినేని నాని లాంటి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దేవినేని ఉమకు పదవి పోయినా మదం దిగలేదని.. ప్రజలు అధికారం నుంచి దించినా అహంకారం తగ్గలేదని విమర్శించారు. మనకున్న హక్కుల్ని కేసిఆర్‌కు అమ్మేసి కేసుల భయంతో చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ఏపీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.