పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం.. ఆ దమ్ముందా.. జనసేనానికి ఏపీ మంత్రి కౌంటర్

పవన్ కల్యాణ్, పేర్ని నాని (ఫైల్)

Andhra Pradesh: రిపబ్లిక్ ఫంక్షన్‌లో పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారణ వ్యక్తం చేశారని పేర్ని నాని అన్నారు.

 • Share this:
  తాను రెడ్లకు పాలేరునైతే పవన్ కమ్మవాళ్లకు పాలేరు అని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాను సీఎం జగన్‌‌కు పాలేరునే అని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరి పాలేరో చెప్పే దమ్ముందా ? అని ప్రశ్నించారు. దేశంలో కిరాయికి రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్ని నాని మండిపడ్డారు. రాజకీయ పార్టీని టెంట్ హౌస్‌లా అద్దెకు ఇస్తున్నారు. రిపబ్లిక్ ఫంక్షన్‌లో పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారణ వ్యక్తం చేశారని పేర్ని నాని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించబోమని చిరంజీవి చెప్పినట్టు పేర్ని నాని అన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆన్‌లైన్ టికెటింగ్ విధానం కొత్తగా పెట్టింది కాదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. అంతకుముందు పేర్ని నానితో తెలుగు సినిమా నిర్మాతలు దిల్ రాజు, దానయ్య సహా పలువురు భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో సినీ పరిశ్రమకు సంబంధం లేదని వాళ్లు మంత్రి పేర్ని నానికి వివరించారు.

  ఆ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యాఖ్యలుగానే చూడాలని కోరారు. సినిమా రంగం చాలా సున్నితమైందని..సినీ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని నిర్మాత దిల్ రాజు అన్నారు. సినిమా పరిశ్రమను రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. ఎవరో ఏదో మాట్లాడితే మాకు సంబంధం లేదని తెలిపారు. సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

  Telangana Congress: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ?.. స్పందించిన సీనియర్ నేత.. ఆ తరువాతే ప్రకటన

  Remove Spiders From Home: ఇంట్లో సాలీడు సమస్య ఉందా ? ఇలా చేయండి.. వెంటనే బయటకు వెళ్లిపోతాయి..

  అంతకుముందు జనసేన పార్టీ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను వైసీపీ నేతలను రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నిస్తుంటే.. వాళ్లు తనను వ్యక్తిగతంగా నిందిస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వైసీపీ గ్రామసింహాలు అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. వారిని వీధి కుక్కలు, పిచ్చికుక్కలతో పోల్చారు. వైసీపీ నేతలకు అన్నీ ఉన్నాయని.. కానీ భయం మాత్రం లేదని వ్యాఖ్యనించారు. వారికి భయం అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. తన వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్ అని.. వైసీపీ వారి జీవితాలు రంగులమయమని అన్నారు. తనపై బూతుపురాణం మొదలుపెట్టారని.. బాపట్లలో పుట్టిన తనకు బూతులు రావా ? అని ప్రశ్నించారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని హెచ్చరించారు. అయితే తాను ఎప్పుడూ సంస్కారం మరిచి మాట్లాడబోనని అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టే బూతులు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: