ఆ విషయంలో కేసీఆర్ మాట కూడా జగన్ వినలేదు... ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

చాలా విషయాల్లో జగన్ కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఒక విషయంలో మాత్రం కేసీఆర్ మాట కూడా జగన్ వినలేదని స్వయాన ఏపీ మంత్రియే సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: February 15, 2020, 9:32 AM IST
ఆ విషయంలో కేసీఆర్ మాట కూడా జగన్ వినలేదు... ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
వైఎస్ జగన్, కేసీఆర్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాక... తెలుగురాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయి. అందుకే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత అనేక సార్లు వీరిద్దరూ భేటీ అయ్యే విభజన హామీలతో పాటు... తెలుు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై చర్చలు జరిపారు. అయితే చాలా విషయాల్లో జగన్ కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఒక విషయంలో మాత్రం కేసీఆర్ మాట కూడా జగన్ వినలేదని స్వయాన ఏపీ మంత్రియే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయని విషయం తెలిసిందే. అదే విధంగా ఏపీలో కూడా ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయవద్దని కేసీఆర్ స్వయంగా చెప్పినా, జగన్ వినలేదని మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం కార్మికులకు అవార్డులను అందించిన సందర్భంగా మాట్లాడిన మంత్రి నాని... ఆర్టీసీ  విలీనం చాలా పెద్ద పొరపాటని కేసీఆర్ అన్నారన్నారు. కార్మికుల వేతనాలను ప్రభుత్వం భరించాలంటే, అదో పెద్ద గుదిబండేనని హెచ్చరించినా, తానిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే జగన్ ముందడుగు వేశారని అన్నారు. ప్రభుత్వంపై కార్మికులు నమ్మకాన్ని ఉంచాలని జగన్ తెలిపారన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం తప్పని భావిస్తే, తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ డిమాండ్ ను సైతం సీఎం పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు