అందుకే చంద్రబాబు ప్రయత్నాలు... మండిపడ్డ ఏపీ మంత్రి

చంద్రబాబు జూమ్‌యాప్‌లో సమావేశాలు పెట్టడం కాకుండా... ప్రజల మద్య తిరగాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.

news18-telugu
Updated: July 16, 2020, 5:50 PM IST
అందుకే చంద్రబాబు ప్రయత్నాలు... మండిపడ్డ ఏపీ మంత్రి
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో ఏదో జరిగిపోతోందని కేంద్రాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్‌ఆర్‌ఇజీఎస్, నీరు-చెట్టు కింద గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న మంత్రి పెద్దిరెడ్డి.. తమ హయాంలో ఎన్‌ఆర్‌ఇజీఎస్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. కేంద్ర నిధులను అడ్డుకునేందుకు చంద్రబాబు ఎంతగానో ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎలాంటి దుర్మార్గుడో ప్రజలకు తెలుసని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఏపీకి చంద్రబాబే తొలి శత్రువు అని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడం చంద్రబాబు నైజమని మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు జూమ్‌యాప్‌లో సమావేశాలు పెట్టడం కాకుండా... ప్రజల మద్య తిరగాలని సూచించారు. చంద్రబాబు ప్రాణభయంతో ఇంట్లో కూర్చుని విమర్శలు చేయడం సరికాదని అన్నారు. దళిత జడ్జి రామకృష్ణ ఎవరో తనకు తెలియదని మంత్రి వివరణ ఇచ్చారు. తాను దళిత వ్యతిరేకినని నిరూపిస్తే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
Published by: Kishore Akkaladevi
First published: July 16, 2020, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading