విశాఖ నుంచి పాలన... ఎప్పుడో చెప్పిన ఏపీ మంత్రి

విశాఖకు రాజధాని తరలింపు అంశంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: February 12, 2020, 6:16 PM IST
విశాఖ నుంచి పాలన... ఎప్పుడో చెప్పిన ఏపీ మంత్రి
వైఎస్ జగన్
  • Share this:
విశాఖను ఏపీ పరిపాలన రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్న జగన్ ప్రభుత్వం... ఎప్పటిలోగా అక్కడి నుంచి పరిపాలన మొదలుపెడుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఈ అంశంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే ఏపీ బడ్జెట్ సమావేశాల తరువాత ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన చేసే అవకాశం ఉందని పరోక్షంగా రాజధాని తరలింపు ఎప్పుడనే దానిపై సంకేతాలు ఇచ్చారు. సీఎం జగన్ ఎక్కడి నుంచి నుంచైనా పాలన చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల అంశంలో చంద్రబాబు అడ్డుపడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు.

అయితే పెద్దిరెడ్డి వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మూడు రాజధానుల బిల్లు మండలిలో ఆగిపోవడంతో... విశాఖ నుంచి పరిపాలన అంశం మరింత ఆలస్యమవుతుందనే వార్తలు వినిపించాయి. అయితే మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులు శాసనమండలిలోని సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని... ఆ రెండు బిల్లులు మండలిలోనూ పాసయినట్టే అని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. దీంతో విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన చేసేందుకు తమకు లైన్ క్లియర్ అయినట్టే అని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే మంత్రి పెద్దిరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉండటంతో... ఆ సమావేశాలు పూర్తయిన వెంటనే విశాఖ నుంచి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశంపై సీఎం జగన్ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.


First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు