చంద్రబాబు హయాంలో అలా... అసలు విషయం చెప్పిన ఏపీ మంత్రి

ప్రభుత్వంపై చంద్రబాబు, ఆయన సొంతపుత్రుడు, దత్తపుత్రుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.

news18-telugu
Updated: November 12, 2019, 5:57 PM IST
చంద్రబాబు హయాంలో అలా... అసలు విషయం చెప్పిన ఏపీ మంత్రి
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్షాకాలంలోనూ ఇసుక తీసేవారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు వర్షాలు లేవని... అందుకే టీడీపీ హయాంలో వర్షాకాలంలోనూ ఇసుక కొరత రాలేదని అన్నారు. చంద్రబాబుకు భయపడి తాము ఇసుక వారోత్సవాలు జరపడం లేదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక లభ్యత గణనీయంగా పెరిగిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90 రీచుల్లో ఇసుక దొరుకుతోందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.ఇసుక లభ్యత రోజుకు లక్షా 25 వేల మెట్రిక్ టన్నులకు చేరిందని అన్నారు. ఇసుక స్టాక్ పాయింట్లను 137 నుంచి 180కి పెంచుతున్నామని అన్నారు.

అయినా ప్రభుత్వంపై చంద్రబాబు, ఆయన సొంతపుత్రుడు, దత్తపుత్రుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో సీఎం నుంచి కిందిస్దాయి నేతల వరకూ ఇసుక దోచేశారని వివరించారు. అశాస్త్రీయంగా వారు చేసిన ఇసుక దోపిడీని అడ్డుకునేందుకు మేం ప్రయత్నించామని అన్నారు. పవన్ గతంలో కరప్షన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు, ఇప్పుడు లాంగ్ మార్చ్ చేశారని విమర్శించారు. కీరణ్ కుమార్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఎర్రచందనం దోచుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండేళ్ల జైలుశిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై తీసుకోబోయే చర్యలను రేపు కేబినెట్‌లో నిర్ణయిస్తామని అన్నారు.


First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...