అది నారా లోకేష్ చాంబర్ ... తనకు వద్దన్న ఏపీ మంత్రి

నారా లోకేష్ ఉన్న చాంబర్ తనకు వద్దంటూ ... తాజాగా మంత్రి పదవి దక్కించుకున్న రాష్ట్ర గనులు, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

news18-telugu
Updated: June 13, 2019, 11:15 AM IST
అది నారా లోకేష్ చాంబర్ ... తనకు వద్దన్న ఏపీ మంత్రి
నారా లోకేష్ (ఫైల్ ఫోటో)
  • Share this:
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ... మంత్రులకు అధికారులు అసెంబ్లీలో చాంబర్‌లను కేటాయించారు. పలువురు మంత్రులు ఇప్పటికే తమకు కేటాయించిన గదుల్లో అడుగు పెట్టి బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే ఓ మంత్రి మాత్రం తనకు కేటాయించిన చాంబర్‌ను తనకు వద్దన్నారు. దీంతో అధికారులు ఖంగు తిన్నారు. అయితే సదరు మంత్రి ఆ గది వద్దని చెప్పడం వెనుక అసలు కారణం వేరే ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ చాంబర్‌లో సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. దీంతో నారా లోకేష్ ఉన్న చాంబర్ తనకు వద్దంటూ ... తాజాగా మంత్రి పదవి దక్కించుకున్న రాష్ట్ర గనులు, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

అంతేకాదు అధికారులకు ఈ విషయాన్ని చెప్పి... తనకు కేటాయించిన చాంబర్‌ను సైతం ఆయన మార్చుకున్నారు. పెద్దిరెడ్డికి తొలుత అధికారులు సచివాలయంలో ఐదో బ్లాక్‌లో చాంబర్‌ కేటాయించారు. గతంలో నారా లోకేష్‌ అదే చాంబర్‌‌లో నుంచి పనిచేశారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దిరెడ్డి... ఆ చాంబర్‌ తనకు వద్దన్నారని సమాచారం. అందులో ఉండేందుకు ఆయన ఇష్టపడలేదని సమాచారం. దీంతో ఆ చాంబర్‌ను మార్చి అధికారులు ఆయనకు వేరే చాంబర్‌ను కేటాయించారు.
First published: June 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading